- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

తెలుగు సినిమా రంగంలో కృష్ణవంశీ అనేది ఒక ప్రత్యేకమైన పేరు. ఒకేసారి కమర్షియల్‌ ఎలిమెంట్స్, భావోద్వేగాలు, కథా బలం, టెక్నికల్ అన్ని మిక్స్ చేసి ప్రేక్ష‌కులు మెచ్చే సినిమా తీసే డైరెక్టర్‌గా పేరుపొందాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మలా కాకుండా, తనదైన శైలితో సినిమాలు తెర‌కెక్కిస్తారు. కృష్ణవంశీ “గులాబి” సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, “నిన్నే పెళ్లాడతా” వంటి సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. కానీ, ఆయన కెరీర్‌లో వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి.


ఒకవైపు క్లాస్ సినిమాలు – మరోవైపు కాంట్రవర్సీలు
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన “మురారి”, “ఖడ్గం”, “సింధూరం”, “రాఖీ”, “చక్రం” వంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా తెర‌కెక్కాయి. "శ్రీ ఆంజనేయం", "చక్రం", "రాఖీ" చిత్రాల్లో ఛార్మీకి వరుసగా అవకాశాలు ఇవ్వడం, అవి కమర్షియల్ పరంగా ఫెయిల్ అవ్వడం వల్ల కృష్ణ‌వంశీపై కొంత కాంట్ర‌వ‌ర్సీ న‌డిచింది. ఒక దర్శకుడు ఒకే హీరోయిన్‌కి మూడు సినిమాల్లో అవకాశం ఇవ్వడం, ముఖ్యంగా ఆ సినిమాలు హిట్ కాకపోవ‌డం అప్ప‌ట్లో ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. “శ్రీ ఆంజనేయం”లో ఛార్మీ పాత్రలో గ్లామర్ డోస్‌ ఎక్కువగా ఉండటం, భక్తి ప్రధాన చిత్రానికి ఇది క‌రెక్ట్ కాద‌న్న‌ విమర్శలు రావడం, “చక్రం”లో ఛార్మీ హాట్ సీన్స్‌కు నెగటివ్ రియాక్షన్స్ రావడం అప్ప‌ట్లో హైలెట్ అయ్యాయి. చివరగా “రాఖీ”లోనూ ఛార్మీకి ప్రధాన పాత్ర ఇచ్చిన కృష్ణవంశీపై అప్పట్లో ఓ విమర్శ వాక్యంగా మారింది. ఇద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ ఉంద‌న్న పుకార్లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది.


ఛార్మీ – పూరి జగన్నాథ్ జంటపై కూడా ఇప్పుడు చర్చే
ప్రస్తుతం ఛార్మీ, పూరి జగన్నాథ్‌తో కలిసి పాన్-ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తోంది. పూరి కనెక్ట్‌ సంస్థలో ప్రధాన భాగస్వామిగా ఉన్న ఆమె, ఇప్పుడు మరోసారి మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కాంబినేషన్లు చూస్తే, ఇండస్ట్రీలో డైరెక్టర్-హీరోయిన్ మధ్య రిలేషన్షిప్‌లు ఎప్పటికీ చర్చకు దారితీస్తూనే ఉంటాయని స్పష్టమవుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: