సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే బ్యూటీలలో మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వారికి మంచి క్రేజ్ వస్తూ ఉంటుంది. కొంత మంది కి మొదటి సినిమా ద్వారా భారీ ఫ్లాప్ వచ్చిన ఆ తర్వాత వారు మంచి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుని అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఖాయదు లోహర్  ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన అల్లూరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అల్లూరి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె కొంత కాలం క్రితం ప్రదీప్ రంగనాథన్ హీరో గా రూపొందిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. 

మూవీ తర్వాత నుండి ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ పలుచటి బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kl