
ఈ ప్రాజెక్టులన్నింటి వల్లే దేవర 2 సినిమా ప్రాజెక్ట్ రావడం కష్టమే అన్నట్లుగా సమాచారం. ఈ పరిణామాల పైన ఆటు దర్శక, నిర్మాతలు ఇటు హీరో మధ్య చర్చలు జరిగాయని.. అందువల్లే దేవర 2 సినిమా ప్రాజెక్టును రద్దు చేసుకోవడానికి కూడా అందరూ ఒకే చెప్పారని సమాచారం. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోకి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఉండడం వల్లే ఒక్కో ప్రాజెక్టు కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారట. ఈ నిర్ణయం వల్లే దేవర 2 సినిమాని రద్దు చేసుకున్నట్లుగా వినిపిస్తున్నాయి.
అలాగే కొరటాల శివ కూడా తను తదుపరి చిత్రాన్ని హీరో నాగ చైతన్య తో ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ కూడా ఇప్పటికే కొత్త కథను నాగచైతన్యకు వినిపించారని ఇద్దరి మధ్య కూడా చర్చలు జరిగి ప్రస్తుతం తుది దశలో నిర్ణయం తీసుకునేలా ప్రాజెక్టు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఇందుకు సంబంధించి వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ దేవర 2 రెండవ భాగం విషయంలో అభిమానులు చాలా ఎదురు చూసినప్పటికీ వారికి ఈ వార్త నిరాశను కలిగించిందని చెప్పవచ్చు. సినీ రంగంలో ఇలాంటి మార్పులు అనేవి చాలా సహజంగానే ఉంటాయి.. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏమంటుందో చూడాలి.