ఏంటి కంగనా రనౌత్ పెళ్ళై పిల్లలు ఉన్న నటుడిని పెళ్లి చేసుకోబోతుందా..అసలు ఈమెకు ఇదేం పోయేకాలం..పెళ్లి కాని వాళ్ళని చేసుకోవచ్చుగా.. అయినా ఈ సెలబ్రిటీలకు ఇది కామన్ అయిపోయింది. పెళ్లయి పిల్లలు ఉన్న వారికి రెండో భార్యలుగా వెళ్లడం అంటూ చాలామంది ఈ విషయం తెలిసి కామెంట్స్ పెడుతున్నారు. అయితే కంగనా రనౌత్ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  కంగనా రనౌత్ హీరోయిన్ గానే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయింది. అలా బిజెపి పార్టీలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.అంతేకాదు కంగనా ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తుతూనే ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా సహజీవనం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

సహజీవనం అనేది కరెక్ట్ కాదు అని, పెళ్లి చేసుకుంటేనే ఆ బంధం నిలుస్తుందని, సహజీవనంలో ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయిస్తారా.. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయ్యాక ఇద్దరి మధ్య బ్రేకప్ అయితే ఆ పుట్టబోయే బిడ్డ బాధ్యత ఎవరిది.. కానీ పెళ్లి చేసుకుంటే కుటుంబం ఉంటుంది.బాధ్యత ఉంటుంది. ఏవైనా గొడవలు వస్తే సర్ది చెప్పడానికి పెద్ద మనుషులు తల్లిదండ్రులు ఉంటారు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అలాగే సహజీవనాన్ని నేను సమర్థించను అంటూ కూడా మాట్లాడింది. అయితే ఇన్ని మాటలు మాట్లాడిన కంగనా రనౌత్ పెళ్ళై పిల్లలు ఉన్న నటుడి ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంటూ కొంతమంది ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే..కంగనా ఆ మధ్యకాలంలో హృతిక్ రోషన్ తో డేటింగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

 కానీ ఆ తర్వాత వీరిమధ్య బ్రేకప్ జరిగింది.అలాగే నటుడు ఆదిత్య పంచోలితో కంగనా సహజీవనం చేస్తుందని, కానీ ఇప్పటికే ఆదిత్య కు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని, అయినా కూడా కంగనా ఆయనకు రెండో భార్యగా ఉండడానికి ఒప్పుకుందని త్వరలోనే ఆదిత్య పంచోలి కంగనల పెళ్లి కూడా జరగబోతుందనే రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్లపై తాజాగా క్లారిటీ ఇచ్చింది కంగనా.నా వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు. అదంతా ఫేక్.. కావాలనే కొంతమంది టార్గెట్ చేసి నాపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు అందులో ఎలాంటి నిజం లేదు అంటూ కొట్టి పారేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: