టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ ఈమేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ కొంత కాలం క్రితం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివరాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాంధు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... మరి కొన్ని రోజుల్లోనే పెద్ది మూవీ యూనిట్ రామ్ చరణ్ మరియు జాన్వి కపూర్ పై ఒక సాంగ్ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాట ఈ సినిమా కథను ముందుకు తీసుకు వెళ్ళనున్నట్లు , అలాగే ఈ కథ చిత్రీకరణ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుండి మేకర్స్ ఒక చిన్న గ్లీ mమ్స్  వీడియోని విడుదల చేయగా , అది అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రస్తుతం అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: