సౌత్ నుంచి బాలీవుడ్ దాకా క్రేజ్ పెంచుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. గత రెండేళ్లలో రష్మిక గ్రాఫ్ చూస్తే జీరో నుంచి హీరో, హీరో నుంచి లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎగబాకిందని చెప్పాలి. గత ఏడాది “పుష్ప 2” తో తిరిగి నేషన్‌వైడ్ క్రేజ్ అందుకున్న రష్మిక, వెంటనే బాలీవుడ్‌లో  “ఛావా” తో బ్లాక్‌బస్టర్ కొట్టింది. అయితే ఆ వెంటనే వచ్చిన “సికిందర్” ఫ్లాప్ కావడంతో హైప్ కొద్దిగా తగ్గింది. కానీ అక్కడే ఆగకుండా, తాజాగా రిలీజ్ అయిన “కుబేర” తో మరోసారి గ్రాండ్ సక్సెస్ కొట్టి, క్రేజ్‌ను సేఫ్ చేసుకుంది. అంటే ఓటమి వచ్చినా, వెంటనే విజయంతో బ్యాలెన్స్ చేసుకోవడం రష్మిక ప్రత్యేకత.
 

ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు .. తెలుగులో “ది గర్ల్‌ఫ్రెండ్” అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. రష్మిక కెరీర్‌లో ఇది ఒక సరైన టైమ్‌లో వచ్చిన ఉమెన్ సెంట్రిక్ మూవీ అవుతుంది అని ట్రేడ్ అంచనా. ఇక బాలీవుడ్‌లో “థామా” అనే సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు చాలా కాలం క్రితమే సైన్ చేసింది. కొత్త కమీట్మెంట్స్ ఎందుకు లేవు? .. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిన రష్మికకి అవకాశాలు రాకపోవడం అసంభవం. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూలో నిలబడతారు. అయితే కొత్త సినిమాలు కమీట్ అవ్వకపోవడానికి కారణం ఒకటే – “అతివేగం ప్రమాదకరం” అన్న సూత్రం. గతంలో వరుసగా సైన్ చేసినా, అందులో కొన్ని ఫ్లాప్స్ రావడంతో రష్మిక జాగ్రత్తగా అడుగులు వేస్తోందట.



తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రతి సినిమాలో నటించడం కంటే, ఒక స్ట్రాంగ్ కంటెంట్ మూవీ చేసి దానితోనే నిలబడాలని నిర్ణయానికి వచ్చిందని ఇండస్ట్రీ టాక్. అందుకే ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు, హిందీ ఆఫర్లను కూడా నో చెప్పేసిందని వార్త. ప్లాన్ ఏమిటంటే..? .. రష్మిక ప్రస్తుతం ఉన్న సినిమాలను పూర్తి చేసి, కొత్త సినిమాలకు సైన్ చేయడమే వాయిదా వేసిందట. వచ్చే ఏడాది నుంచి మాత్రమే కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతుందనే సమాచారం. ఈ గ్యాప్‌లో తన ఇమేజ్ పాన్-ఇండియా స్థాయిలో ఎక్కడా దెబ్బ తినకుండా జాగ్రత్తగా ప్లాన్ వేసుకుందట. మొత్తానికి – “హీరోయిన్‌గా అతివేగం కంటే, స్లోగా కానీ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్తేనే నిలబడగలం” అన్న నిజాన్ని రష్మిక బాగా అర్థం చేసుకుందన్నమాట. నేషనల్ క్రష్‌కి ఈ స్మార్ట్ మూవ్ ఇకపై మరింత పెద్ద విజయం తేవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: