
కానీ అదే డేట్‌కి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి తేజ సజ్జ మిరాయ్ వస్తోంది. ఈ రేండు ఒకే రోజున వస్తే థియేటర్ల కోసం జోరుగా గట్టి పోటీ తప్పదు. ఇంకా ముందే తన డేట్ లాక్ చేసుకున్నవాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సెప్టెంబర్ 12కి కిష్కిందపురిని ఫిక్స్ చేసి టీజర్‌తో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. అప్పుడు అదే వారంలో మాస్ జాతర, మిరాయ్ కూడా వస్తే … మూడు సినిమాల మధ్య గట్టి రగడ తప్పదు. థియేటర్ల షేరింగ్ విషయంలో నిర్మాతలకు తలనొప్పే. అయితే సెప్టెంబర్ 25వ తేదీకి మాత్రం ఎవరూ దగ్గరకి రానని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఓజి బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమాపై ఉన్న బజ్, హైప్ అలా మామూలు కాదు.
హరిహర వీరమల్లు ఆగిపోయినా ఓజీ మీద ఒక్క శాతం కూడా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే పంపిణీదారులు కూడా దానయ్యకు ఎప్పుడూ చూడని రేంజ్ రేట్లు ఆఫర్ చేస్తున్నారట. దాంతో ఫిలిం నగర్‌లో ‘అఖండ 2’ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. ఇక అదే నెలలో విజయ్ ఆంటోనీ భద్రకాళి కూడా 12న వస్తుంది. మొత్తం చూస్తే కేవలం ఇరవై రోజుల్లో ఘాటీ – మాస్ జాతర – మిరాయ్ – కిష్కిందపురి – ఓజి లాంటి ఐదు టాలీవుడ్ బిగ్ సినిమాలు, అదనంగా రెండు తమిళ డబ్బింగ్స్ వస్తున్నాయి. అందులో ఎవరు గెలుస్తారు? ఎవరు తగ్గిపోతారు? అన్నది సెప్టెంబర్‌నే చెప్పబోతుంది. కానీ ఓ విషయం మాత్రం ఖాయం – ఈ నెల టాలీవుడ్ థియేటర్లలో గట్టి వాతావరణం నెలకొనడం పక్కా..!