టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్లు ఫ్రెండ్స్‌గా ఉంటారు. అయితే కొంతమంది ఆ ఫ్రెండ్‌షిప్‌ను బయట పెడితే, మరికొంతమంది బయట పెట్టరు. మరీ ముఖ్యంగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా, ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆయనతో ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి ఇండస్ట్రీలో దాదాపు అందరితో క్లోజ్‌గా ఉంటారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. వారి బాగోగులు అడిగి తెలుసుకుంటారు. అయితే చిరంజీవికి మాత్రం బెస్ట్ ఫ్రెండ్‌గా నిలిచింది భానుచందర్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1978 నుంచి 2020 వరకు భానుచందర్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. 80వ దశకంలోని హీరోలలో ఇతనూ ఒక స్టార్ అన్న విషయం మర్చిపోకూడదు.


మన ఊరి పాండవులు, ఆడవాళ్లు మీకు మా జోహార్లు, గూఢచారి నెంబర్ వన్ వంటి వందకు పైగా చిత్రాలలో నటించి భానుచందర్ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈయన మంచి మిత్రుడు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా బయట పెట్టారు. “మేము ఒకే రూమ్‌లో ఉండే వాళ్లం. మన ఊరి పాండవులు మూవీ షూటింగ్ టైంలో మేము ఒకే రూమ్‌లో ఉన్నాము. అప్పుడు వాడే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపడం నేర్పించాడు. ‘నీకు బైక్ నడపడం వచ్చా?’ అని అడిగాడు. నాకు టూ-వీలర్ రాదని, కారు నడుపుతానని చెప్పాను. అప్పుడు అక్కడే ఉన్న రాజుగారు, రెడ్డిగారు బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించారు. మా ఇద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మేమిద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు గంట గంటకు వర్షం వచ్చేది. ఆ టైంలో మేము చేసిన అల్లరి రోజులు ఎప్పటికీ మర్చిపోలేను” అని సరదాగా చెప్పారు.

 

ఆ విషయాలను ఇప్పుడు మరోసారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ భానుచందరనే .. వాళ్లిద్దరి చనువు బాండింగ్ సో స్పెషల్ అని  మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ సరదాగా మాట్లాడిన మాటలు, చేసిన అల్లరి పనులు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. కాగా నేడు చిరంజీవి బర్త డే సంధర్భంగా ఆయన చేసిన మంచి పనులను హైలెట్ చేసి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: