
ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆమె పేరు మళ్లీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ ద్వారా తన పేరు ఇంటింటికి తెలిసిపోయి, ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ మొదటి దశలోనే సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూ వస్తోంది. తాజాగా ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం మరింత సంచలనం సృష్టించాయి. సినిమా పరిశ్రమలో సెక్స్, సక్సెస్, మధ్య రిలేషన్షిప్ వంటి సెన్సిటివ్ టాపిక్స్ గురించి నేరుగా మాట్లాడటమే కాకుండా తన స్వంత అనుభవాలను కూడా బహిరంగంగా వెల్లడించింది.
“సక్సెస్ కోసం సెక్స్ చేస్తే తప్పు ఏంటి..? ఇండస్ట్రీలో చాలా సార్లు ఇలా జరుగుతుంది. ఎవరో ఒకరు ‘సక్సెస్ కావాలంటే ముందుగా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాలి’ అని చెబుతారు. ఇద్దరూ అంగీకరిస్తే అందులో తప్పేముంది? అది వాళ్లిద్దరి వ్యక్తిగత నిర్ణయం” అని స్పష్టంగా చెప్పింది. అభిమానులు కూడా దీక్ష పంత్ ఇచ్చిన సమాధానాన్ని చాలా బోల్డ్‌గా, పచ్చిగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే దీక్ష తాను మాత్రం అలా చేయలేదని, ఆ దారిని ఎప్పుడూ ఎంచుకోలేదని కూడా ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. “నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ నేను అలాంటివి పెద్దగా పట్టించుకోలేదు. దాని ఫలితంగా నేను పెద్ద స్టార్‌గా మారలేకపోయానని కూడా చెప్పొచ్చు. కానీ నా మనసు నాకెప్పుడూ క్లియర్‌గా ఉంది. అందుకే ఎలాంటి పశ్చాత్తాపం లేదు” అంటూ బహిరంగంగా ప్రకటించింది. దీక్ష పంత్ ఈ వ్యాఖ్యలతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. చాలా మంది “దీక్ష బోల్డ్ కామెంట్స్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది” అంటుండగా, మరికొందరు మాత్రం “ఇలాంటివి చెప్పకపోతే ఎవరు గుర్తించరు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు హీరోయిన్స్” అని అంటున్నారు. ఏది ఏమైనా, ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు – ఇండస్ట్రీలో బోల్డ్ మాటలతో దీక్ష పంత్ పేరు మళ్లీ హాట్ సబ్జెక్ట్ అయిపోయింది.