కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన శృతిహాసన్  ఈ మధ్యకాలంలో కథల విషయంలో  ఆచితూచి అడుగులు వేస్తోంది. అయినా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం కూలీ. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ మిక్స్డ్ టాకును సంపాదించుకుంది. అయితే ఇందులో శృతిహాసన్ ప్రీతి పాత్రలో కనిపించింది. సినిమా విడుదల కాకముందే  ఈమె పాత్ర పైన చాలా రకాలుగా ప్రచారం అయితే జరిగింది.


విడుదలైన తరువాత కొంతమంది ఏకంగా ప్రీతి లాంటి పాత్ర శృతిహాసన్ కు ఇవ్వడం నిజంగానే అన్యాయమంటూ కామెంట్స్ చేశారు. తాజాగా  శృతిహాసన్  ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్లైన్లో ఒక సెషన్ నిర్వహించగా.. అక్కడ ఒక నేటిజన్ ప్రీతి పాత్ర ఇవ్వడం మీకు చాలా అన్యాయంగా అనిపించలేదా అంటూ ప్రశ్నించారు?. ఈ విషయంపైన శృతిహాసన్ మాట్లాడుతూ నాకు అలా అనిపించలేదు నిజంగా చెప్పాలి అంటే ఆ పాత్ర చాలా షేడ్స్ ఉన్న పాత్ర అంటూ తెలిపింది.


ఆ పాత్ర నాకు బాగా నచ్చింది ఆ పాత్ర ఎలా డిజైన్ చేయాలన్నది నా చేతులలో ఉండదు అంత డైరెక్టర్ ఇష్టమే ఇప్పటివరకు తాను అలాంటి పాత్ర చేయలేదని ఆ పాత్ర మహిళలకు బాగా నచ్చుతుందని చేశానని తెలిపింది. అదొక్కటే ఆ పాత్రలో నాకు నచ్చిన అంశం అంటూ తెలియజేసింది. కూలీ సినిమాలోని ఆపాత్ర నాకు నిజంగానే ఇష్టం అంటూ తెలిపింది శృతిహాసన్. అయితే తనపై వస్తున్న రూమర్లకు ఇలా చెక్ పెట్టింది శృతిహాసన్. కూలీ సినిమా ఇప్పటివరకు రూ .400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జున సైమన్ పాత్రలో నటించగా ఇతర భాషలలోని నటీనటులు కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఫైనల్ గా  కూలీ మూవీ ఎన్ని కోట్ల రూపాయలను రాబడుతుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: