ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సీరియల్ హీరోయిన్ లకు సినిమా హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. కొంత మంది సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని అద్భుతమైన హీరోయిన్స్ స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. కొంత మంది సీరియల్స్ లో పద్ధతి గల పాత్రలలో నటిస్తూ స్కిన్ షో కి చాలా దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసే వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది.  ఓ సీరియల్ హీరోయిన్ని  ఒక సంవత్సరం పాటు ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆమె వరస సీరియల్స్ లలో నటిస్తూ అదిరిపోయే రేంజ్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఇంతకు బ్యాన్ చేయబడి ప్రస్తుతం సూపర్ సాలిడ్గా అవకాశాలను దక్కించుకుంటున్నా ఆ నటి ఎవరు ..? అనుకుంటున్నారా ... ఆమె పేరు పల్లవి గౌడ.  ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా పల్లవి గౌడ మాట్లాడుతూ ... తనను ఇండస్ట్రీ నుండి ఎందుకు బ్యాండ్ చేశారు ..? అసలు ఏం జరిగింది ..? అనే వివరాలను క్లియర్ గా తెలియజేసింది. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా పల్లవి గౌడ మాట్లాడుతూ ... నేను ఒకే సమయంలో రెండు సీరియల్స్ చేస్తున్నాను. ఆ సమయంలో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. కానీ షూటింగ్ కి వెళ్ళాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అని నాకు తెలిసింది. అలాంటి సమయం లో నేను కొన్ని అనుకోని కారణాల వల్ల 20 రోజుల పాటు బెంగుళూరులో లాక్ కావాల్సి వచ్చింది. 

ఆ తర్వాత షూటింగ్కు వెళ్లాను. కానీ ఓ వైపు రెండు సీరియల్స్ , ఇటు సినిమా వీటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. అలాంటి సమయంలో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్నా డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత సీరియల్ జరుగుతున్నప్పుడు మరో ప్రాజెక్టుకు ఎలా అగ్రిమెంట్ చేస్తావ్ అని తనను బెదిరించినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తనను బ్యాన్ చేశారని ఈ బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం పల్లవి గౌడ వరుస సీరియల్స్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: