
`సింహా`, `లెజెండ్`, `అఖండ` వంటి సూపర్ హిట్స్ అనంతరం బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే అఖండ2పై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. ఫ్యాన్స్ బాలయ్య తాండవాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు తెగ ఉత్సాహ పడుతున్నారు. మొదట దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ కారణంగా విడుదల ఆలస్యం అవుతోంది. డిసెంబర్ లేదా జనవరిలో అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు.
ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ పోటీ పోటీ పడ్డాయి. కానీ లాస్ట్ మినిట్‌లో మేకర్స్ ఆ రెండు సంస్థలకు షాకిచ్చి జియో హాట్‌స్టార్‌తో బిగ్ డీల్ సెట్ చేసుకున్నారట. అఖండ 2 అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను జియో హాట్‌స్టార్ ఏకంగా రూ. 85 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
ఓటీటీ బిజినెస్ పరంగా బాలయ్య కెరీర్‌లో ఇది నిజంగా పెద్ద డీల్ అనే చెప్పుకోవచ్చు. అలాగే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ రూపంలో రూ. 35 నుంచి 40 కోట్లు రాబట్టే ఛాన్స్ గట్టిగా ఉంది. అంటే నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే మేకర్స్ కు రూ. 125 కోట్లు వచ్చేశాయి. ఇక బాలయ్య మాస్ క్రేజ్, సక్సెస్ రేటు మరియు సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ రూ. 120 నుంచి 130 కోట్ల రేంజ్‌లో జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా అఖండ 2 రూ. 250 కోట్లు బిజినెస్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.