
ఇండస్ట్రీలో ఎప్పుడూ తన ప్రత్యేక శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ, కొత్త తరహా యాక్షన్ ఎలిమెంట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన సినిమాలు రా యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేలకు పేరుగాంచాయి. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత ఆయనకు దక్షిణాది ప్రేక్షకుల్లోనే కాదు, ఉత్తరాదిలో కూడా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యే సరికి ప్రశాంత్ కెరీర్ మరో లెవెల్‌కి చేరుతుందని ట్రేడ్ టాక్.
ఇక సలార్ 2 సీక్వెల్ పై కూడా ప్రశాంత్ ఫోకస్ పెడుతున్నారని సమాచారం. ఈ రెండు భారీ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్‌కి మరో సూపర్ జాక్‌పాట్ అవకాశం దక్కబోతోందన్న వార్త ఫిలిం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఆఫర్ ఇచ్చింది మరెవరో కాదు, సూపర్‌స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ గట్టిగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి కావడానికి కనీసం 3 సంవత్సరాలైన పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మూవీ మేకర్స్. ఆ లోపు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా, సలార్ 2 పనులు పూర్తి చేసి, తదుపరి మహేష్ బాబుతో కాంబినేషన్ సినిమా సెట్స్ మీదకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
మహేష్ బాబు – ప్రశాంత్ నీల్ కాంబో సెట్ అవ్వడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని కూడా ఫిలిం నగరంలో ఓ చర్చ వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మంచి స్నేహితులు కాగా, మహేష్ బాబు – ఎన్టీఆర్‌లకు కూడా స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధమే ఈ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమం చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే, తెలుగు సినీ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని స్థాయి హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. ప్రశాంత్ నీల్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే గోల్డెన్ ప్రాజెక్ట్ ఇది అని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.