
సినిమా రిలీజ్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేందుకు మేకర్స్ రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఈనెల 19న విజయవాడలో ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరగనుండగా, 21న హైదరాబాద్‌లో మరోసారి భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ రెండు ఈవెంట్స్ కూడా పవన్ ఫ్యాన్స్ కోసం ఓ విజువల్ ఫీస్ట్ కానున్నాయి. ఇక ఈ ఈవెంట్స్‌కి హాజరయ్యే గెస్ట్ లిస్టు కూడా హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలో జరగబోయే ఈవెంట్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం. మరోవైపు, హైదరాబాద్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా వేడుకకు అన్నయ్య చిరంజీవి హాజరైతే మెగా అభిమానులు పండగ చేసుకుంటారని చెప్పకనే చెప్పొచ్చు. ఒకవైపు గ్లోబల్ లెవెల్‌లో తన ప్రతిభను చాటుకున్న రాజమౌళి, మరోవైపు పవన్ కెరీర్‌కు బలమైన సపోర్ట్‌గా నిలిచిన చిరంజీవి – ఈ ఇద్దరూ ఓజీ ఈవెంట్స్‌కు హాజరుకానున్నారని తెలిసి అభిమానుల్లో జోష్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి హాట్ టాపిక్‌గా మారింది. “పవన్ రేంజ్ అంటే ఇదే!” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. పవన్, సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ఓజీ కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌ను మరోసారి హై పీక్స్ లోకి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.