సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడం ఇప్పుడు సర్వసాధారణం. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, ఒకసారి థియేటర్లలోకి వచ్చేసింది అంటే వెంటనే ఆ సినిమాకి సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. అభిమానులు, సినిమా ప్రియులు తమ రివ్యూలు, కామెంట్స్ పెట్టి సినిమాపై ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఆ టాక్ ఆధారంగా చాలామంది సినిమా చూడాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదిక ఇప్పుడు సినిమా విజయా పరాజయాలకు ఒక పెద్ద ప్రమాణంగా మారిపోయింది అని చెప్పాలి.


నేటి బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు విడుదలై భారీగా చర్చనీయాంశమయ్యాయి. వాటిలో మొదటిది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “కిష్కిందపురి”. ఈ సినిమా పూర్తిగా హారర్ జోనర్‌లో తెరకెక్కించబడింది. అందమైన నటి అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కౌశిక్ పేగులపాటి మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించాడు. ఈ కథలో హారర్, మిస్టరీ సన్నివేశాలు కొన్ని ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా సినిమా హారర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి థియేటర్లలో కూర్చున్నవారు స్క్రీన్‌పై జరిగే ప్రతి సీన్‌పై దృష్టి పెట్టేలా సన్నివేశాలు రూపొందించబడ్డాయి.



అయితే ఈ సినిమా మొత్తంగా చూసినప్పుడు ఫైనల్ టచ్ మాత్రం పెద్దగా ఆశాజనకంగా లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కథలో ఉన్న సస్పెన్స్, హారర్ పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు చాలా ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. అంతేకాక, కొన్ని సీన్లు చాలా సింపుల్‌గా, బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కథను ఇంకా కొంచెం లోతుగా తీసుకెళ్లి ఉంటే, హారర్ సన్నివేశాలను మరింత హైలైట్‌గా చూపించి ఉంటే ఈ సినిమా మరింత రేంజ్‌లో ఉండేదని అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. థియేటర్లో సీన్ వస్తూనే "ఇక నెక్స్ట్ ఇదే సీన్ వస్తుందేమో" అని ఊహించేలా సినిమా నడుస్తోందని కొందరు కౌంటర్ కామెంట్స్ ఇస్తున్నారు.



బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే తన కెరీర్‌లో ఒక పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. "కిష్కిందపురి" సినిమా ఆయన కెరీర్‌కి బిగ్ సక్సెస్ అందిస్తుందనే అంచనాలు పెట్టుకున్నా, ఇప్పటివరకు వచ్చిన రివ్యూలు, పబ్లిక్ టాక్ ప్రకారం ఈ సినిమా కూడా ఆ స్థాయిలో విజయాన్ని అందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో "కిష్కిందపురి"కి మిక్స్డ్ టాక్ లభిస్తోంది. కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాను బాగుంది అంటుంటే, మరికొందరు సాధారణ స్థాయిలో ఉన్నదని, యావరేజ్ మూవీ అని అభిప్రాయపడుతున్నారు.



మొత్తం మీద, "కిష్కిందపురి" సినిమా హారర్, మిస్టరీ జానర్‌లో కొంతమంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినా, కంటెంట్‌ను మరింత బలంగా, కట్టిపడేసే విధంగా తెరకెక్కించి ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించే అవకాశం ఉండేదని చెప్పాలి. ఇక ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉంటాయి..? వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఎంత వరకు థియేటర్లలో నిలబడగలదో చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: