తమిళంలో హీరోగా పేరు సంపాదించిన జయం రవి గురించి చెప్పాల్సిన పనిలేదు. తన చిత్రాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి బాగానే పేరు సంపాదించారు. ఈమధ్య సినిమాలలో కంటే తరచూ తన భార్యవిడాకుల వ్యవహార తో తన పేరు వినిపించింది..అనంతరం ప్రేయసి అయిన ప్రముఖ సింగర్ కెనీషా తో డేటింగ్ విషయంలో వినిపించగా.. అప్పటినుంచి వీరిద్దరూ బహిరంగంగానే కనిపిస్తున్నారు. నిన్నటి రోజున ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ లో జరగగా ఈ మ్యాచ్ చూడడానికి జయం రవి తన ప్రేయసితో వెళ్లినట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కెనీషా స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో మరొకసారి వీరి బంధం బయటపడింది అంటు కామెంట్స్ చేస్తున్నారు.



ఒకవైపు తన భార్య ఆర్తి విడాకుల కేసు విచారణ జరుగుతూ ఉన్న సమయంలోనే ఇలా కేనీషాతో కలిసి బహిరంగంగా కలిసి కనిపిస్తున్నారు. కెనీషా వల్లే తమ వైవాహిక బంధం విడిపోవడానికి కారణమంటూ జయం రవి భార్య ఆర్తి కోర్టులో కూడా ఆవేదన తెలియజేసింది. కెనీషా దుబాయ్ కి కేవలం క్రికెట్ మ్యాచ్ చూడడానికే కాదు ఆమె అక్కడ ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనకు జరిగిన ఒక వింత అనుభవాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. మొత్తానికి మరొకసారి ఈ జంట ఇలా అడ్డంగా బుక్ అవడంతో  మరొకసారి వార్తలలో నిలుస్తున్నారు జయం రవి.


త్వరలోనే జయం రవి, కెనీషా వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన మాత్రం ఇప్పటి వరకు వీరు ఖండించలేదు అంతేకాకుండా పలు రకాల ఈవెంట్స్ కి కూడా ఇద్దరూ కలిసి వెళ్లడం మరింత బలాన్ని చేకూరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: