టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు ఇద్దరు కుమారులు అయినటువంటి మంచు విష్ణు , మంచు మనోజ్ అలాగే ఒక కూతురు అయినటువంటి మంచు లక్ష్మి వీరు ముగ్గురు కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఇకపోతే మంచు లక్ష్మి కూడా తన సినిమా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది. ఈమె తెలుగు లో చాలా కాలం క్రితం విడుదల అయిన అనగనగా ఒక దీరుడు అనే సినిమాలో ప్రతి నాయక పాత్రలో నటించింది.  

మూవీ పెద్ద స్థాయి విజయం అందుకోకపోయినా ఈ సినిమా ద్వారా మంచు లక్ష్మి కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించింది. ఇకపోతే మంచు లక్ష్మీ ఇప్పటివరకు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అలాగే కొన్ని టీవీ షో లకు హోస్ట్ గా వ్యవహరించింది. అలాగే మరికొన్ని ఓ టీ టీ షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది. తాజాగా ఈమె దక్ష అనే సినిమాలో నటించింది. ఈ మూవీ లో మోహన్ బాబు కూడా ఓ పాత్రలో నటించాడు. తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ ... మా నాన్న గారు అయినటువంటి మోహన్ బాబు గారు కొన్ని సంవత్సరాల క్రితం హిందీ సినిమా అయినటువంటి పీకూ అనే మూవీ లో హీరో గా నటించారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ సినిమాని నేను రీమేక్ చేయాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అని ఈమె చెప్పుకొచ్చింది. ఇకపోతే మంచు లక్ష్మి "దక్ష" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో ... ఏ రేంజ్ గుర్తింపును సంపాదించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: