
ఐస్ క్రీమ్ పేరు బదులుగా ఎసుకీమో లేకపోతే ఒరుంబోనుంగి అని పిలవాలంటు ఉత్తర్వులను జారి చేశారు కిమ్. ఉత్తర కొరియాలో ఈ పదాలకు మంచు లాలిపాప్ లేదంటే మంచి ఐస్ బార్ అని అర్థం వస్తుందట. ముఖ్యంగా నార్త్ కొరియా కథనాల ప్రకారం పర్యటన రంగాలలో వెస్ట్రన్ పదాలవాడకం ఎక్కువగానే ఉంటుందని.. వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే కిమ్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టూర్ గైడ్లకు కూడా అక్కడ ఉండే స్థానిక పదాలకు కూడా శిక్షణ ఇస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
కిమ్ ను ఎదిరిస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు అందుకే ప్రజలు ఎదిరించలేరు. అక్కడి ప్రజలు, గైడ్లు అసహనాన్ని తెలియజేస్తూనే శిక్షణ పొందుతున్నారు. ఆగస్టు 21 నుంచి ఈ శిక్షణ ప్రారంభమైందట. మూడు నెలల్లో ముగుస్తుంది.అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్ కు మాత్రమే కాదని.. హ్యామ్ బర్గ్ తో పాటుగా మరికొన్ని లోకల్ పదాలను లోకల్ భాషలలో పిలవాలనే విధంగా కిమ్ జారీ చేశారు.
ఉత్తర కొరియాలో నిషేధించిన పదాలను కొనసాగిస్తే మాత్రం చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి.. ముఖ్యంగా 3 నుంచి 5 ఏళ్ల పాటు నిర్బంధ కూలిగా శిక్ష ఉంటుంది. ఆ సమయంలో భోజనం, వైద్య సదుపాయాలు సరైనవి ఉండవు. లేకపోతే కుటుంబాలను వెలివేస్తారు. ఆస్తి జప్తు లేదా భారీ జరిమానా. కొన్ని సందర్భాలలో మరణశిక్ష కూడా వేయవచ్చు.
కిమ్ మరికొన్ని సంచలన నిర్ణయాలు..
విదేశీ వినోదం, మీడియా పైన నిషేధం: విదేశీ పాటలు సినిమాలు సంగీతం టీవీ షోలు చూడడం నేరం.
మొబైల్ ఫోన్: విదేశీ నెట్వర్క్ లను ఉపయోగించే మొబైల్స్ కలిగి ఉండడం కూడా నేరమే.
వివాహ విడాకులు: విడాకులు తీసుకునే దంపతులకు కారగారా శిక్షలకు గురిచేస్తారు.
ఆధ్యాత్మిక స్వేచ్ఛ: మతకళ్ళలాలు ఇతర కార్యక్రమాలు సంఘాలు ఏర్పరచడం వంటివి నిషేధం.
హెయిర్ స్టైల్, లెదర్ జాకెట్ ల పైన కూడా అక్కడ నిషేధం ఉన్నది.
జులై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులు పైన కూడా అక్కడ నిషేధమే.