ప్రముఖ ప్రవచన  కర్త గరికపాటి నరసింహారావు చేసే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. టాలీవుడ్ సినిమాను ఉద్దేశించి తాజాగా గరికపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే తెలుగు సినిమా 8 వసంతాలు  చూడాలని ఆయన తెలిపారు.  ఈ సినిమా చూస్తే  నిజమైన ప్రేమ అంటే ఏంటో కచ్చితంగా తెలుస్తుందని గరికపాటి చెప్పుకొచ్చారు.

ఈ సినిమాను తాను  చూశానని గరికపాటి అన్నారు. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుందని కలిసి ఉన్నా విడిపోయినా వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారని చెబుతూ గరికపాటి ప్రవచనాలను సంబంధించిన వీడియోను టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ  నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. జూన్ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు.

అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. హేషం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్  గా నటించగా ఆమె పాత్ర సినిమాకు హైలెట్  గా నిలిచింది. ఫణింద్ర నర్సేట్టి డైరెక్షన్ లో ఈ  సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో  తెరకెక్కింది.

8 వసంతాలు సినిమా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువమంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.  ప్రేక్షకుల నుంచి సరైన సపోర్ట్ దక్కితే ఫణింద్ర నర్సేట్టి  రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. 8 వసంతాలు  సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అయితే  సినిమా కొంతమేర స్లోగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: