
మనం నవ్వినప్పుడు మన మెదడులో ఉండే ఎండార్పన్లు, డోపమైన్ లను విడుదల చేస్తాయి.. ఇవి మన శరీరంలో ఉండే ఒత్తిడిని సైతం తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
అలాగే నవ్వడం వల్ల ఎక్కువగా రక్త ప్రసరణ చాలా సులువుగా జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే రోజులో కనీసం 5నుంచి 10 నిమిషాల పాటు అయినా ఎవరైనా నవ్వడం మంచిది.
రోజులో కనీసం రెండు మూడు సార్లు అయినా నవ్వడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపరిచేలా చేస్తుంది. అలాగే మనసును కూడా తాజాగా ఉండేలా చేస్తుంది.
నవ్వడం వల్ల మన జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా ఎక్కువగా నిద్రపోయేలా చేస్తుంది.
నిరంతరం ఆనందంగా, సంతోషంగా ఉండడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది యోగతో పాటుగా నవ్వును ఉదయం లేవగానే యోగలో భాగంగా చేర్చుకుంటారు.
ఏమైనా ఫన్నీ వీడియోలు, ఫన్నీ పుస్తకాలు చదవడం చాలా ముఖ్యము.. ఇలాంటివి పిల్లలకు చదివించడం వంటివి అలవాటు చేయించడం కూడా చాలా ముఖ్యమే.
తరచు నవ్వుతూ ఉండడం వల్ల మనలో 108 కండరాలు ఉత్తేజితమైన శక్తి లభిస్తుంది.. అలాగే బీపీ కూడా అదుపులో. 15 నిమిషాల పాటు నవ్వితే 40 క్యాలరీల వరకు కొవ్వు కరుగుతుంది.
హాయిగా నవ్వుతూ ఉండేవారికి నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడవు.. నవ్వడం వల్ల థైరాయిడ్, మై గ్రీన్ వంటి సమస్యలు సైతం దూరమవుతాయి.