బెంగళూరు నగరంలోని శివాజీ నగర్ మెట్రో స్టేషన్ పేరును మార్చడంపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగింది. శివాజీ మహారాజ్ పేరుకు బదులుగా 'సెయింట్ మేరీ మెట్రో స్టేషన్' అని పేరు పెట్టాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్య ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

శివాజీ మహారాజ్ కేవలం మహారాష్ట్రకు మాత్రమే కాకుండా, యావత్ భారతదేశానికి గర్వకారణమైన పాలకుడని , ఆయన పేరును మార్చడం దురదృష్టకరమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. అలాగే, ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఫడ్నవీస్ నిలదీశారు. ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, శివాజీ మహారాజ్ పేరును యథాతథంగా కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ వివాదంపై ఇంకా స్పందించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.   కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సిద్దరామయ్య తానూ తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: