ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వ్యవహారం గత రెండు మూడు రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా కాలేజీలు అన్నిటిని కూడా ప్రైవేటీకరణం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్పడంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన ఫైర్ అవుతూ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా.. వాటిని వద్దని చెప్పింది కూటమి ప్రభుత్వం. దీంతో చాలామంది వైసిపి నేతలు మండిపడుతూ.. 2024 మార్చిలోనే పులివెందుల మెడికల్ కాలేజీలను మాజీ సీఎం జగన్ ప్రారంభించారని.. కాలేజీ హాస్టల్ కు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.


నేషనల్ మెడికల్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా వ్యవస్థ వచ్చి ఏకంగా 50 సీట్లు కేటాయించింది అంటే మెడికల్ కళాశాలలు పూర్తి అయినట్టే కదా.. మెడికల్ కళాశాలలు పూర్తి కాకపోతే ఈ కళాశాలకు ఎలా 50 సీట్లు కేటాయిస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు. కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వైద్య విద్య అందించాల్సింది పోయి అన్ని ప్రైవేటీకరణం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

కానీ 2018లో మంగళగిరి ఎయిమ్స్ లో నేషనల్ మెడికల్ కౌన్సిలర్ ఇలాగే సీట్లు కేటాయించగా.. క్యాంపస్ రెడీ కాకపోవడంతో విజయవాడ సిద్ధార్థ కాలేజీలో క్లాసులు జరిపించారు. అప్పుడు టిడిపి పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు ఇచ్చినా కూడా బిల్డింగులు రెడీ కాలేదని చెప్పి తరగతులు జరిపించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆరోజు మంగళగిరిలో క్యాంపస్ లేకపోయినా విజయవాడ సిద్ధార్థ కాలేజీలో క్లాసులు ఎలా జరిపారో? ఇప్పుడు కూడా పులివెందులలో కూడా అదే అప్లై చేయొచ్చుగా అంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ విషయంపై చాలామంది మెడికల్ విద్యార్థులు కూడా  అండగా నిలవడం గమనార్హం. ఏది ఏమైనా చంద్రబాబు పులివెందుల మెడికల్ కాలేజీ పై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు అని జగన్ మండిపడుతున్నారు.. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: