పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ' (OG). మరో ఎనిమిది రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

సినిమా కథాంశం, స్టోరీలైన్‌ గురించి అభిమానుల్లో అనేక సందేహాలున్నాయి. ఈ సందేహాలకు త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌తో స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు.

మరోవైపు, 'ఓజీ' సినిమా టికెట్ రేట్లు కూడా భారీగానే ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయని, వాటి టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, 'ఓజీ' రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించే దిశగా దూసుకుపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'సాహో', 'రన్ రాజా రన్' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హై-బడ్జెట్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. దర్శకుడు సుజీత్ కెరీర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.  ఈ సినిమాకు సుజీత్ కు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని తెలుస్తోంది.

ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్  కన్మణి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ ఈ సినిమాలో తన పాత్రకు మంచి పేరు వస్తుందని ఆమె నమ్ముతున్నారు. ఓజీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: