
ఈ సినిమాలో అనుష్క రెండు భిన్నమైన పాత్రలు పోషించి నటిగా పది మెట్లు ఎక్కేసింది. తన స్టార్డమ్ ను అమాంతం పెంచేసుకుంది. అరుంధతి తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచింది. మరోవైపు పసుపతి పాత్రలో సోనుసూద్ స్క్రీన్ ప్రెజెన్స్, క్రూరత్వం, డైలాగ్ డెలివరీ సినిమాలో మేజర్ హైలైట్. అలాగే ప్రస్తుత కాలం – గత కాలం మేళవింపులో దర్శకుడు ఎలాంటి గందరగోళం లేకుండా కథను నడిపించిన తీరు, విజువల్స్, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ, కోటి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.
తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని చాలా ఏళ్ల క్రితమే ఇతర భాషల్లో రీమేక్ చేయడం జరిగింది. కానీ అనుష్కను ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. హిందీలోనూ దీపికా పదుకొణెతో రీమేక్‌ను ప్లాన్ చేసినప్పటికీ.. అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అటెకెక్కింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. `దృవ`, `గాడ్ ఫాదర్` వంటి సినిమాలు చేసిన డైరెక్టర్ మోహన్ రాజా అరుంధతిని హిందీలోకి రీమేక్ చేయబోతున్నారట.
అంతేకాదు, హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది స్పష్టత లేదు. ఒకవేళ నిజమైతే మాత్రం శ్రీలీల రాంగ్ స్టెప్ వేసినట్లే అవుతుంది. యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ లో అనుష్కను మరిపించడం శ్రీలీల తరం కాదు. పైగా అరుంధతి డబ్బింగ్ వెర్షన్ ను ఆల్రెడీ నార్త్ ఆడియెన్స్ చూశారు. సో.. రీమేక్ వల్ల చేతులు కాలడమే తప్ప ఒరిగేదేమి ఉండదు.