
ఈ హిట్ సందర్భంగా మూవీ మేకర్స్ ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా, అందులో అడవి శేష్ కూడా పాల్గొన్నారు. ఈ మీట్‌లో ఆయన చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.
అడవి శేష్ మాట్లాడుతూ ..“మా మౌళికి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో హౌస్ ఫుల్ రికార్డు రావడం చూసి నేను నిజంగా గర్వంగా ఫీలవుతున్నాను. నువ్వు ఎలా అయితే జనాలను నవ్వించావో, ఏడిపించావో, అలా స్టార్స్‌లా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నా ఇంటర్వ్యూలన్నీ చూసినవాళ్లు తెలుసుకుంటారు – ఈ ఏడాదిలో నా ఫేవరెట్ మూవీ ఇదే. ఏదో హ్యాంగ్ ఓవర్‌లో అన్నట్లుకాదు, నిజంగానే నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకి లిటిల్ హార్ట్ అనే టైటిల్ కాకుండా "బిగ్ హార్ట్" అని పెట్టాలి అనిపించింది. నేను ఒక డైరెక్టర్ హిట్ కొట్టగానే ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి, తర్వాత మనం సినిమా చేద్దాం అని చెప్పే వాడిని కాదు. అలా నేను ఎప్పుడూ చేయను కూడా” అని మాట్లాడారు. ఈ మాటలతో ఒక్కసారిగా హాల్‌లోనే కాక సోషల్ మీడియాలోనూ చర్చలు మొదలయ్యాయి.
“ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించిందా?” అన్న సందేహం ఫ్యాన్స్‌కి కలిగింది. కొంతమంది ఈ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవిపై అన్నారని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఏ సినిమా హిట్ అయినా చిరంజీవి ఆ డైరెక్టర్‌ని ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి, ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి అడవి శేష్ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పారేమో అని చాలామంది భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం .. “అది చిరంజీవి గురించే కాదు, అసలు ఆయనకన్నా వేరొక స్టార్ హీరో కొడుకును టార్గెట్ చేస్తూ అడవి శేష్ మాట్లాడారు” అని అంటున్నారు. టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో కుమారుడు, ఇటీవల కాలంలో ప్రతి హిట్ డైరెక్టర్‌ను ఇంటికి పిలిచి, పార్టీ ఇచ్చి, తర్వాత వారితో సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఆ కారణంగానే అడవి శేష్ సూటిగా కాకుండా సార్కాస్టిక్‌గా కామెంట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు.
దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవైపు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నవాళ్లు, మరొకవైపు “ఇది ఆ స్టార్ కొడుకే” అని ఫిక్స్ అవుతున్నవాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా, అడవి శేష్ కామెంట్స్ ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతున్నాయి.