పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఓజీ మూవీ థియేటర్లలోకి రానే వచ్చింది. ఈ సినిమా థియేటర్లోకి వచ్చి రాగానే అభిమానులు పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ కి ఫిదా అయిపోయారు. దాదాపు సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు ఎవరూ కూడా థియేటర్లలో తమ సీట్లలో కూర్చోలేదు. ప్రతి సీన్ కి ఎంజాయ్ చేస్తూ ఈలలు వేస్తూ గోల చేస్తూ థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి ఓజి మూవీతో తీరినట్టు అయింది. మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించి పార్ట్-2  కూడా ఉంటుంది అని సినిమా చివర్లో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్.మరి ఓజి మూవీ పార్ట్ 2 నిజంగానే ఉండబోతుందా.. ఓజి సీక్వెల్లో ఉండే ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తను ఒప్పుకున్న మూడు సినిమాలు మాత్రమే చేస్తానని తర్వాత సినిమాలు చేయనని చెప్పారు.

కానీ ఇప్పటికే హరిహర వీరమల్లు,ఓజి విడుదలయ్యాయి ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే ఉంది.కానీ హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యాక పార్ట్-2 కూడా ఉంటుందని రివీల్ చేశారు.అయితే తాజాగా విడుదలైన ఓజీకి కూడా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చేశారు. ఇక ఓజి సీక్వెల్ ఉంటే అందులో ఉండే స్టోరీ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఓజి మూవీలో జపాన్ కి చెందిన సమురాయ్ అనే పాత్రలో కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటు జపాన్లో తన ప్రత్యర్థులైనటువంటి యుకుజిల్ని చంపడంతో పాటు ముంబైకి వెళ్లి అక్కడ ఓమిని కూడా చంపుతారు. దీంతో ముంబైకి చెందిన డేవిడ్ భాయ్ పవన్ కళ్యాణ్ పై పగ పెంచుకుంటాడు. అటు జపాన్ లోని యుకుజిలు కూడా పవన్ కళ్యాణ్ ని చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఓజి సీక్వెల్లో పవన్ కళ్యాణ్ ని చంపడం కోసం జపాన్ యుజికులు,ముంబై డేవిడ్ భాయ్ ఇద్దరు చేతులు కలుపుతారు..

దీన్నే ఓజీ సీక్వెల్లో దర్శకుడు చూపించబోతున్నారు అని తెలుస్తోంది. అలా మొత్తానికి క్లైమాక్స్ లోనే ఓజి పార్ట్ 2 గురించి దర్శకుడు హింట్ ఇచ్చేశారు అంటున్నారు చాలామంది ఈ సినిమా చూసిన జనాలు. అలాగే ఈ సినిమా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని చెప్పడంతో ఓజీకి సీక్వెల్ కూడా ఉంటుంది అని,ఆ సీక్వెల్లో పవన్ కళ్యాణ్ తో పాటు చివర్లో మరో హీరో కూడా కనిపించి ఆ హీరోతో సినిమాని కంటిన్యూ చేస్తారు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓజీ కి సీక్వెల్ గా వచ్చే ఓజీ పార్ట్ 2 మొదటి పార్ట్ కు మించిన యాక్షన్ సన్నివేశాలతో డైరెక్టర్ తెరకెక్కించడానికి రెడీగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అతి కష్టం మీద తాను ఒప్పుకున్న సినిమాలు చేస్తున్నారు.ఇలాంటి సమయంలో సీక్వెల్స్ చేయడం సాధ్యమవుతుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి చూడాలి హరిహర వీరమల్లు సీక్వెల్, ఓజి సీక్వెల్స్ వస్తాయా.. ఈ సీక్వెల్స్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: