
ఇది అంతా కూడా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగకముందు వరకు మాట్లాడుకున్న టాక్. కానీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత మొత్తం టాక్ మారిపోయింది. “ఏం మాయ చేసావ్ సుజిత్? పవన్ కళ్యాణ్‌కి ఏం మందు పెట్టావు? నరనరాల్లో ఊపు వచ్చేసింది” అంటూ ఫ్యాన్స్ ఘాటు ఘాటుగా కామెంట్లు చేశారు. దీనికి కారణం ఆ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన ఎనర్జీ. దాంతో సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో పెరిగింది. ఫైనల్లీ థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. అభిమానులు ఎలా చూడాలని కోరుకున్నారో, ఆ కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చేశాడు. అయితే ఓజీ సినిమా విషయంలో సుజిత్ చేసిన ఒకే ఒక్క తప్పు ఫ్యాన్స్‌కు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఇచ్చింది.అసలు కథలో కొత్తదనం లేదు.
ఇలాంటి స్టోరీస్ మనం ముందే చాలానే చూసాం. అయినప్పటికీ ఓజీకి ఇంత పాజిటివ్ టాక్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ మేనరిజం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన ఈ సినిమాలో నటించకపోతే, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేదనే మాట వాస్తవం. డైరెక్షన్ విషయంలో సుజిత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ కథ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, ఎమోషనల్ టచ్‌తో పాటు మరికొన్ని సీన్‌లకు హై ఎలివేషన్ ఇచ్చి ఉంటే మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు పూర్తిగా సంతృప్తి కలిగేది.ఇప్పటికీ ఫ్యాన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు కానీ రివ్యూల్లో మాత్రం “కథ లేదు” అనే నెగిటివ్ పాయింట్ కామన్‌గా వినిపిస్తోంది. దాని వల్లే సోషల్ మీడియాలో అడపా దడపా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతోంది. అది తప్పిస్తే సుజిత్ ఈ సినిమా విషయంలో టోటల్ సక్సెస్ అయ్యేవాడు అన్నది నిజం.