ఈమధ్య చిన్న వయసులోనే అధిక బరువు పెరగడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా బరువు తగ్గాలని యువత చాలామంది అన్నం బదులుగా చపాతీలను తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి కొంతమంది జొన్న రొట్టెలు తినడానికి మక్కువ చూపిస్తారు. జొన్న రొట్టెల వల్ల లాభాలు తెలిస్తే మాత్రం తినక మారరు.


చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. ఈ జొన్నలతో చేసేటువంటి రొట్టెలలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. గోధుమ పిండితో చేసే రొట్టెల కంటే జొన్న రొట్టెలు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది.


ముఖ్యంగా జొన్న రొట్టెలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. రోగాలు దరి చేరకుండా పోరాడే శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా వేగవంతంగానే జరుగుతుంది.


రొట్టెలలో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. కాబట్టి రక్తహీనతతో ఇబ్బంది పడేవారు వీటిని తినడం మంచిది. వారంలో కనీసం రెండుసార్లు అయినా రొట్టెలు తినడం వల్ల శరీరంలో వృద్ధాప్య ఛాయలు తక్కువగా కనిపిస్తాయి.


బరువు తగ్గాలనుకునేవారు ఈ రొట్టెలను తింటూ ఉంటే త్వరగా బరువు తగ్గుతారు. ఈ రొట్టెల వల్ల తక్షణమే శక్తి లభించేలా చేస్తాయి. మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నశింప చేయడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి, దీనివల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.



ఎవరైతే డయాబెటిస్, బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారు రొట్టెలను తరచూ తినడం మంచిది. జొన్న రొట్టెలలో క్యాల్షియం, ఫాస్పరస్ లాంటివి అధికంగా ఉంటాయి, ఇవి దంతాలను ఎముకలను మరింత దృఢంగా ఉండేలా చేస్తాయి.


జొన్న రొట్టెలలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మం మీద ఉండే కణాలను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే జొన్న రొట్టెను తినమని మన పూర్వీకులు కూడా సలహా ఇస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: