
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ మరోసారి ఓజీ సినిమాకి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు అభిమానులు ఓజీ అప్డేట్ అడిగిన ప్రతిసారీ పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు సమాధానం ఇచ్చేవారు, కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేసేవారు. "పోలిటికల్ మీటింగ్‌ల్లో సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?" అంటూ ఆయన ఓపెన్‌గా కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత మలుపు తిరిగింది.అందరూ అనుకున్నట్లుగానే – "ఓజీ రిలీజ్ అయింది, ఇక అభిమానుల హడావుడి తగ్గిపోతుంది" అని పవన్ కళ్యాణ్ ఊపిరి పీల్చుకునే లోపే – అభిమానులు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్స్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజి సినిమా గురించి వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. "ఓజీ 2" అనే హ్యాష్‌ట్యాగ్‌తో విపరీతమైన రచ్చ జరుగుతోంది.
ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. "ఓజీ 2 స్క్రిప్ట్ ఏంటి? ఈ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్ రాబోతున్నాడా? లేక పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలోనే ఉంటారా?" అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, "ఓజి సినిమా, సాహో సినిమా, ఓజీ యూనివర్స్కి లింక్!" అంటూ కొత్త ప్లాన్ లు పుట్టుకొస్తున్నాయి. "ఓజీ 2లో రాంచరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు" అని ఓ టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా "పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తాడు" అనే వార్త అభిమానుల ఎగ్జైట్మెంట్‌కి కారణమవుతోంది.
దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మీమ్స్, ట్రోల్స్ వరదలా వస్తున్నాయి. ఎక్కడ చూసినా అభిమానులు సరదాగా "ఓజీ 2.. ఓజీ 2" అంటూ నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి రాజకీయ పార్టీ మీటింగ్‌లో కనిపించినా, బయటికెళ్ళినా అభిమానులు అరుపులు, కేకలు వేస్తూ "ఓజీ 2 అప్డేట్ ఇవ్వాలి" అని కోరడం ఖాయమని అనిపిస్తోంది.ఇక కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పబ్లిక్‌గా ఇలా కామెంట్ చేస్తున్నారు:"ఈసారి అన్న మళ్లీ జనాల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఓజీ 2 అప్డేట్ ఇవ్వాల్సిందే" అంటూ తమ అభిమానాన్ని బహిరంగంగా చాటుకుంటున్నారు.
మొత్తానికి, ఓజీ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆగేలా లేరు. ఇప్పుడు వారంతా ఫుల్ ఫోర్స్‌తో ఓజీ 2 పేరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ట్రెండింగ్ టాపిక్‌గా మార్చేశారు. దీంతో "ఓజీ 2" అనే పేరు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఇండస్ట్రీ మొత్తానికి హాట్ టాపిక్‌గా మారింది.