
ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రదీప్ రంగనాథ్ ఇందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. మమిత బైజు, ప్రదీప్ రంగనాథ్ మధ్య లవ్ సన్నివేశాలు కామెడీ, రొమాన్స్ సిన్స్ బాగానే ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే నేహా శెట్టితో ,ప్రదీప్ కెమిస్ట్రీ కూడా యూత్ ను మరింత అట్రాక్షన్ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రంతో నేహా శెట్టికి అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. ఇందులో కమెడియన్ సత్య, శరత్ కుమార్ వంటి నటీనటులు కూడా నటిస్తున్నారు. కథలో లవ్ ట్రాక్, థ్రిల్లింగ్ ,యాక్షన్ సన్నివేశాలు ,కామెడీ సీన్స్ అన్నీ కూడా హైలెట్ గా ఉన్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
డ్యూడ్ ట్రైలర్ తో యూత్ కావలసినంత స్టఫ్ కనిపిస్తోంది గతంలో కూడా ప్రదీప్ నటించిన లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇప్పుడు ఆ చిత్రాల బాటలోనే డ్యూడ్ సినిమా టార్గెట్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం ట్రైలర్ కూడా ప్రదీప్ రంగనాథ్ ఎనర్జీ తోనే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఏ మేరకు విజయాలను అందుకుంటారో చూడాలి మరి. అంతేకాకుండా ప్రదీప్ రంగనాథ్ నటించిన మరో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కూడా అక్టోబర్ 17వ తేదీన చేస్తుండడం గమనార్హం.