సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి ఒక్క సారిగా అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. అలాంటి వారికి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం ఓ సంగీత దర్శకుడికి వరుస పెట్టి అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇంతకు ఆ సంగీత దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రస్తుతం ఈయన చాలా క్రేజీ సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. మరి కొంత కాలం లోనే రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా స్టార్ట్ కానున్న విషయం మన అందరికి తెలిసిందే.

మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఓకే అయ్యాడు. ఇకపోతే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కూడా ఇయనే సంగీత దర్శకుడుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెండు తెలుగు క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న ఈయన తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా ఓకే అయ్యాడు.

ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ప్రస్తుతం ఈయన చేతిలో ఏకంగా మూడు అద్భుతమైన క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు మంచి విజయం సాధించి , ఈయన మ్యూజిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే ఈయన టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి చేరే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hr