సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల జంటకంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించిన జంట ఎవరంటే — వారు మరెవరో కాదు దివ్వెల మాధురి – దువ్వాడ శ్రీనివాస్. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరు చేసే ప్రతి వీడియో, ప్రతి రీల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, యూట్యూబ్‌ నుండి ఇన్‌స్టాగ్రామ్‌ వరకు ఎక్కడ చూసినా వీళ్ల పేరు గాలిలో తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జంట మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. కారణం? దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం! ఒక్కసారిగా ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. “మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిందా?” అంటూ నెటిజన్లు షాకింగ్ గా రియాక్ట్ అవుతున్నారు. షోలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మాధురి చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.“ఇకపై మీరు చూడబోయేది దివ్వెల మాధురి కాదు… దువ్వాడ మాధురి 2.0! నా అసలైన రూపం ఇప్పుడే కనిపిస్తుంది,” అని ఘాటుగా చెప్పింది.


ఇక ఆమెలోని ఆత్మవిశ్వాసం, ఆ యాటిట్యూడ్ బిగ్ బాస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, మాధురి బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా హైలెట్ అయింది.“నా భర్త దువ్వాడ శ్రీనివాస్ గారు ఒప్పుకోకపోయి ఉంటే నేను ఈ షోకి రావడం అసాధ్యం. ఆయన నా సపోర్ట్, నా బలం, నా ప్రేరణ. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండే దాన్ని కాదు,” అని ఎమోషనల్‌గా చెప్పింది.



అంతేకాదు, “మాధురి అంటే శ్రీనివాస్… శ్రీనివాస్ అంటే మాధురి” అని చెప్పి ఈ జంట మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో మళ్లీ ప్రూవ్ చేసింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా తన భార్యకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.“మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నా. ఇప్పటివరకు బిగ్ బాస్‌లో మీరు ఎన్నో కంటెస్టెంట్స్ చూశారు, కానీ ఇప్పుడు మీరు చూడబోతున్నది ఒక లేడీ టైగర్! ఆమె ఎవరో తెలుసా? అదే నా మాధురి! ఇకపై మీరు బిగ్ బాస్ 2.0 చూస్తారు. ఆమె ఎవ్వరికి ఎదురు వెళ్లినా ..ఎవరు ఆమెకు ఎదురు వచ్చినా.. వారికే ప్రమాదం!”



ఈ మాటలతో ఆయన ఆమెని ఎంతగా నమ్ముతున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో స్పష్టంగా చూపించారు. అయితే వీడియోలో ఆయన ఇచ్చిన టోన్, డైలాగ్ స్టైల్ వల్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు.“నా మాధురిని టచ్ చేస్తే తాట తీస్తా” అంటూ దువ్వాడ శ్రీనివాస్ అందరికి పరోక్షకంగా వార్నింగ్ ఇచ్చిన్నట్లైంది. దీనితో, నెటిజన్లు సోషల్ మీడియాలో ఇలా కామెంట్ చేస్తున్నారు:“ఇంత కేర్ చూపించే పర్సన్ అరుదు.”“మాధురి గెలిచినా గెలవకపోయినా ఈ సీజన్ హైలైట్ ఆమెదే.”“బిగ్ బాస్ హౌస్‌లో లేడీ టైగర్ ఎంట్రీ అంటే ఇదే!” అంటూ పొగిడేస్తున్నారు.



ఇక అభిమానులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు — “ఈ సీజన్ కప్పు కొట్టేది దివ్వెల మాధురి తప్ప మరెవ్వరు కాదు!”ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ హౌస్‌లో మాధురి ఎలా ప్రవర్తిస్తుందన్న దానిపైనే ఉంది. ఆమె గేమ్ ప్లే ఎలా ఉంటుంది, ఎవరితో క్లాష్ అవుతుంది, ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ, దువ్వాడ మాధురి  శ్రీనివాస్  ఈ సీజన్‌లోనూ సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేయడం ఖాయం అంటూ నెటిజన్లు అంటున్నారు —“ఈ సీజన్‌లో ఎంటర్టైన్మెంట్ పీక్‌కి తీసుకెళ్లేది మాధురి మాత్రమే!”చూడాలి మరి, రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఆమె పర్ఫార్మెన్స్ ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో!



మరింత సమాచారం తెలుసుకోండి: