ఈ ఏడాది ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో బిగ్గెస్ట్‌ క్లాష్‌లలో ఒకటిగా ఆగస్టు 15న విడుదలైన “ కూలీ ” మరియు “ వార్ 2 ” సినిమాలు నిలిచాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున కలయికలో రూపొందిన “కూలీ” ఒక వైపు ఉంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన “వార్ 2” మరో వైపు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదలకు ముందే ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రిలీజ్ తరువాత రెండింటికీ కూడా బ్లాక్‌బస్టర్ టాక్ రాకపోయినా, వసూళ్ల పరంగా “కూలీ” డామినేష‌న్ చాటుకుంది. థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ సాధించిన “ కూలీ ” సౌత్‌ మార్కెట్లో దుమ్ము లేపగా, “ వార్ 2 ” నార్త్‌ మార్కెట్లో స్థిరమైన వసూళ్లను రాబట్టింది. కానీ కొన్ని వారాల తర్వాత ఈ రెండు చిత్రాలు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్‌లో విడుదలయ్యాయి. రజనీకాంత్ “కూలీ” అమెజాన్ ప్రైమ్ వీడియోలో, “వార్ 2” మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.


ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్‌ ప్రకారం, ఓటిటి రన్‌లో మాత్రం “ వార్ 2 ” పైచేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన వ్యూయర్ రెస్పాన్స్, ట్రెండింగ్ లిస్టుల్లో ర్యాంకింగ్ చూసుకుంటే, “ వార్ 2 ” ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న‌ట్టు లెక్క‌లు చెపుతున్నాయి. దీనికి ప్ర‌ధాన‌ కారణం హిందీ వెర్షన్ కూడా సమాంతరంగా రిలీజ్ అవడం అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు “ కూలీ ” మొదట్లో హిందీ వెర్షన్ లేకపోవడం తో ఆ గ్యాప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మొత్తానికి థియేటర్లలో “ కూలీ ” ముందంజలో ఉండగా, ఓటిటి దశలో “ వార్ 2 ” దూసుకెళ్లడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ రెండు సినిమాలు తమ తమ స్టార్ పవర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా చివరికి ఓటిటి వేదికల్లో “ వార్ 2 ” విజయం సాధించినట్టుగా క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: