
డెబ్యుటెంట్ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాండ్ పూజా కార్యక్రమాలలో ప్రారంభమైంది. పాన్-ఇండియా కాన్సెప్ట్‌గా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. థాయ్‌లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్‌తో కలిసి రూపొందించారు. అదే సిరీస్‌లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది. సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్ (పుష్ప, జైలర్ 2 ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు. కట్టలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.