
ఇక సమంత చేసిన పుష్ప సినిమాలోని “ఊ అంటావా మావ” స్పెషల్ సాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆ సాంగ్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. ఆమె డాన్స్ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్, గ్లామర్ — అన్నీ కలిపి పాటను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఆ ఒక్క సాంగ్ ద్వారా సమంతకు వచ్చిన క్రేజ్ ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు టాలీవుడ్‌కి కొంత దూరంగా ఉంటూ బాలీవుడ్ లో, వెబ్‌సిరీస్‌లలో కొత్త ప్రాజెక్ట్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదుగానీ, ఆమె పేరుతోనే మేకర్స్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుండటం చూస్తే ఆమె స్థాయి ఏంటో అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చేంటంటే — సమంత మరోసారి ఐటెం సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ చేస్తే నిర్మాతలు నిమిషానికి ఒక కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడరని! ఈ లెక్కన చూస్తే మూడు నిమిషాల పాటకు మూడు కోట్లు ఖాతాలో పడినట్టే! అభిమానులు అయితే సరదాగా “సమంత ఒక్క సాంగ్ చేస్తేనే మేకర్స్ కి బ్లాక్‌బస్టర్ గ్యారంటీ” అంటున్నారు. మరికొంతమంది అభిమానులు అయితే “అమ్మడు డిమాండ్ పెంచితే నిమిషానికి రెండు కోట్లైనా ఇస్తారు! మూడు నిమిషాల సాంగ్ చేస్తే ఆరు కోట్లు ఖాతాలో పడతాయి!” అని అంటున్నారు. ఇది అన్నీ సమంత సాధించిన స్థాయి, ఆమె ప్రతిభ, మరియు అభిమానుల ప్రేమకు నిదర్శనం.ఇంతటి క్రేజీ, టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా అరుదు. సమంత ఎప్పటికీ ఒక ప్రేరణ, ఒక ఐకాన్, ఒక అభిమానుల హార్ట్ థ్రాబ్‌గానే నిలుస్తుంది.