సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటు ఉంటారు. మరి కొంత మంది హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో మంచి విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారు చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటారు అని జనాలు కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ వారిలో కొంత మంది ఆ తర్వాత మంచి విజయాలను అందుకోకపోవడం వల్ల స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లలేక పోతారు.

అలాంటి వారు మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా చాలా మంది ఉన్నారు. ఇక స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని జనాలు అనుకున్న ఆ రేంజ్ కు వెళ్లలేకపోయిన టాలీవుడ్ హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టిన కొత్త లోనే కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. దాని తర్వాత కూడా ఈమెకు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరో విజయం దక్కింది. ఇలా కెరియర్ ప్రారంభం లోనే ఈమెకు రెండు అద్భుతమైన విజయాలు దక్కడం , అందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు.కానీ ఈమె ఆ తర్వాత నటించిన సినిమాలతో మంచి విజయాలను అందుకోకపోవడం వల్ల ఈమె కెరియర్ మెల్లి మెల్లిగా కిందికి పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఏమీ లేవు. కానీ పర్వాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఈ ముద్దుగుమ్మ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: