
దసరా పండుగ సందర్భంగా, వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గానే నిశ్చితార్థం చేసుకున్నారని కొన్ని మీడియా హౌస్‌లు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో #VijayRashmikaEngagement హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. అభిమానులు “కంగ్రాట్స్ రౌడీ హీరో అండ్ నేషనల్ క్రష్” అంటూ రకరకాల మెసేజులు పంపుతూ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుతున్నారు. ఇంకా అధికారికంగా రష్మిక లేదా విజయ్ దేవరకొండ ఎవరూ ఈ విషయం గురించి బహిరంగంగా స్పందించలేదు. అయితే రీసెంట్‌గా జరిగిన “ధామ” సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మీడియా ముందుకు వచ్చింది. ఒక రిపోర్టర్ ఆమెను కంగ్రాట్యులేట్ చేశారు.
దీనికి రష్మిక ఎటువంటి మాట మాట్లాడకుండా కేవలం సిగ్గుపడుతూ తలదించుకుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో చాలా మంది హీరోయిన్లు నేరుగా వీటికి కౌంటర్ ఇస్తారు. లేదా కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అవుతారు. కానీ రష్మిక మాత్రం సింపుల్‌గా స్మైల్ ఇచ్చి సిగ్గుపడుతూ తలదించుకోవడంతో అక్కడ ఉన్నవాళ్లు అంతా చప్పట్లు కొట్టారు. ఈ ఒక్క రియాక్షన్‌తోనే ఫ్యాన్స్ “కన్ఫర్మ్ అయిపోయారు. రష్మిక – విజయ్ ఎంగేజ్మెంట్ నిజం!” అంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే, సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్నా - విజయ్ కి సంబంధించిన కొన్ని కొత్త ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఆమె చేతికి ఒక బ్యూటిఫుల్ రింగ్ కూడా కనిపించడం అభిమానుల ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఫ్యాన్స్ మాత్రం ఇక ఓపెన్‌గా "రౌడీ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా కనపడటానికి ఎదురుచూస్తున్నాం!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ, బాండ్, మరియు ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు చూస్తుంటే — “ఈ జంట రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు” అన్న భావన అందరిలో కలుగుతోంది.