తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటికే వారు ఇస్తామన్న ఆరు గ్యారెంటీలలో కొన్ని అమలు చేసి మరికొన్ని మరిచిపోయారు. అమలు చేసిన పథకాలన్ని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ వాళ్ళు చేసే పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు విఫలమవుతున్నారు. ముఖ్యంగా వీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి ఉంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది. కానీ వాటిని కూడా డిలే చేసుకుంటూ వచ్చి ప్రస్తుతం ఎలక్షన్స్ పెట్టడానికి మల్ల గుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా 42% రిజర్వేషన్ అనే ఒక నినాదాన్ని బయటకు తీసుకువచ్చి దాని చుట్టే ప్రజల్ని తిప్పుతున్నారు. కట్ చేస్తే ఓవైపు బీసీ సంఘాల ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి వారి బలాన్ని చూపించాలి. ఇదంతా పక్కనపెట్టి ఏకంగా క్యాబినెట్ లో ఉన్న మంత్రులే ఒకరికొకరు గొడవలు పెట్టుకొని ప్రజల మధ్య చులకన అయిపోతున్నారు. 

ముఖ్యంగా ఆ మధ్యకాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్  సహచర మంత్రి వడ్లూరి లక్ష్మణ్ ని  దున్నపోతు అంటూ సంభోదించారు. ఇది కాస్త వివాదం అవ్వడంతో క్షమాపణలు కోరాడు. అంతే కాకుండా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం కూడా చాలావరకు వచ్చింది. ఇది మరువకముందే కొండా సురేఖ  కూతురు సుస్మిత బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల రాజ్యం నడుస్తోందని రెడ్లు బీసీ కులాలను అస్సలు సహించడం లేదంటూ మాట్లాడింది. ఇదిలా నడుస్తున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్లకు అన్యాయం జరుగుతుందని ఆయన గలాన్ని వినిపిస్తున్నారు. అంతేకాదు పార్టీలు మారిన నాయకులకు పెద్ద పెద్ద పదవులు వచ్చాయని మాలాంటి పార్టీలు పట్టుకొని ఉన్నవారికి పదవులు లేవని మాట్లాడారు.  

ఈ విధంగా రాష్ట్రస్థాయిలో పాలన చేసే హోదాలో ఉన్న ఈ మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడం, పాలనను గాలికి వదిలేయడం వంటివి చేస్తుంటే ప్రజల్లో చులకన అయిపోతున్నారు. మళ్లీ వీరందరి టార్గెట్ రేవంత్ రెడ్డిని గద్దె దించడమే. కానీ బయటకి అలా నటిస్తూ లోపల మాత్రం రేవంత్ రెడ్డిపై కోపాన్ని పెంచుకుంటున్నారని తెలుస్తోంది. ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే  వారి సొంత సమస్యలు కాకుండా పేద ప్రజల కోసం పాటుపడాలి. ప్రభుత్వం నుంచి అందించే పథకాల్లో విద్యా, వైద్యం ఇతర అవసరాలను తీరుస్తూ ముందుకు వెళ్లాలి. కానీ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని మరచిపోయి వారికి వారే గొడవలు పెట్టుకుని ప్రజల్లో చాలా పలుచబడి పోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజేసిన ఈ కుల చిచ్చు చివరికి ఆయన సీఎం సీటుకే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: