విజయవాడ రాజకీయాల్లో  బుద్దా వెంకన్న పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు పార్టీ తరఫున అత్యంత బలమైన గళంగా నిలిచిన ఆయన, గత ఆరు నెలలుగా రాజకీయాల్లో మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పూర్తిగా నిశ్శబ్దం పాటించడమే కాకుండా, పబ్లిక్‌గా ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణంగా పార్టీ లోపల ప్రాధాన్యం తగ్గడం, తన కృషికి తగిన గుర్తింపు రాకపోవడమేనన్న చర్చ‌లు ప్ర‌ధానంగా వినిపించాయి. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించి టీడీపీ గ్రాఫ్ పెంచేందుకు కృషి చేశారు. అయినా కూడా తనను పక్కన పెట్టారని ఆయనకు కలిగిన ఆవేదన వల్లే కొంతకాలం వెనక్కి తగ్గారన్నది ప్రచారం. ఈ గ్యాప్ సమయంలో ఆయనకు వైసీపీ నేతల నుండి ఆహ్వానాలు వచ్చాయన్న టాక్ కూడా వినిపించింది. అయితే బుద్దా మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకుండా పార్టీ పట్ల నిబద్ధత చూపించారు.


ఇటీవల‌ సమాచారం ప్రకారం, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జోక్యం చేసుకోవడంతో చంద్రబాబు - బుద్దా మధ్య ఉన్న అంతరాలు తొలగిపోయాయని చెబుతున్నారు. ఆ పరిణామాల తర్వాత చంద్రబాబు విజ‌యవాడ పర్యటనలో బుద్దాకు మళ్లీ ప్రాధాన్యం లభించింది. దీంతో ఆయన పార్టీ కార్యకలాపాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు.
తాజాగా రాష్ట్రంలో వెలుగుచూసిన నకిలీ మద్యం వ్యవహారంపై నాయకులు మౌనంగా ఉండగా, బుద్దా వెంకన్న మాత్రం ఘాటుగా స్పందించారు. ఈ కేసులో అద్దేపల్లి జనార్ధన్‌రావు చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు వెలుగులోకి రావడంతో, జోగి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్దా గట్టిగా ప్రతిస్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే, బుద్దా వెంకన్న మళ్లీ టీడీపీ తరఫున బలమైన వాయిస్‌గా మారడానికి రెడీ అవుతున్నార‌ని అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం ఆయన విజయవాడ న‌గ‌ర‌ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ నామినేటెడ్ పోస్టుల నియామక ప్రక్రియలో ఉన్న దశలో, బుద్దాకు కీలక స్థానాలు దక్కే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. దీంతో విజయవాడ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే సూచనలు కనబడుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: