టాలీవుడ్లో ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ అంటే ఒక పెద్ద పండుగే. సినిమా అభిమానులు మాత్రమే కాదు, నిర్మాతలు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఇది అత్యంత కీలకమైన సీజన్. అందుకే ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు, ఎవరు చివరికి వెనక్కి తగ్గుతారు అన్న చర్చ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. మొదటినుంచే బరిలో ఉన్న సినిమాలు “ మన శంకర వరప్రసాద్ ”, “ అనగనగా ఒక రాజు ”. వీటికి తాజాగా “ రాజా సాబ్ ” కూడా జాయిన్ అవడంతో పోటీ మరింత టఫ్‌గా మారింది. ఇప్పటికే ఈ మూడు సినిమాలు థియేటర్లను బాగా సర్దుబాటు చేసుకున్నాయని ఇండస్ట్రీ టాక్. ఇంతలోనే తమిళ హీరోల సినిమాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. విజయ్ నటించిన “ జననాయకుడు ”, సూర్య నటించిన “ కరుప్పు ” సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి సంక్రాంతికే రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. దీంతో ఇప్పటికే థియేటర్ల కోసం క్యూలు పెరిగిపోయాయి. మరి ఈ పరిస్థితిలో ఇంకో సినిమా రిలీజ్ చేయడం అసాధ్యమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయినా రవితేజ నటిస్తున్న “ భర్త మహాశయులకు విజ్ఞప్తి ” మరియు శర్వానంద్ నటిస్తున్న “ నారీ నారీ నడుమ మురారి ” సినిమాలు కూడా సంక్రాంతి రిలీజ్‌నే టార్గెట్ చేస్తున్నాయి. మొదట వీటి షూటింగ్ ఆలస్యమవడంతో పోటీ నుంచి తప్పుకున్నట్లుగా అనిపించినా, తాజాగా రవితేజ సినిమా నుంచి సంక్రాంతి రిలీజ్ లీక్స్ రావడం, శర్వా సినిమా నుంచి అధికారిక పోస్టర్ రావడంతో సస్పెన్స్ మళ్లీ మొదలైంది. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బెర్తులు ఫిక్స్ అయిన సినిమాల్లో ఒకటి లేదా రెండు తప్పుకుంటేనే కొత్త సినిమాలకు అవకాశం దొరుకుతుందనేది ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. చివరికి బరిలో నిలిచేది ఎవరో, వెనక్కి తగ్గేది ఎవరో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులైనా వేచి చూడాల్సిందే. థియేటర్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాతే అసలు సంక్రాంతి రేస్ క్లారిటీ రానుంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం..ఈ సంక్రాంతికి టాలీవుడ్లో సూపర్ క్లాస్ పోటీ తప్పదు..!
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.