
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రాజమౌళి ప్రత్యేకమైన స్టోరీ టెల్లింగ్ స్టైల్ అన్నీ కలిపి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. కీరవాణి సంగీతం.. పంచదార బొమ్మ వంటి పాటలు విన్నవారిని మైమరపించాయి.ఈ సినిమానే టాలీవుడ్ చరిత్రలో తొలిసారిగా 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమాగా నిలిచింది. ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టి, తెలుగు సినిమా రేంజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.‘మగధీర’ విజయంతో రామ్ చరణ్ కెరీర్ ఒకే సినిమాతో సూపర్‌స్టార్ స్థాయికి చేరింది. ఈ మూవీ తర్వాత అనేక సినిమాలు ఆ రికార్డును బీట్ చేయడానికి ప్రయత్నించినా, ఆ స్థాయి మ్యాజిక్ మళ్లీ సృష్టించలేకపోయాయి.
భారతీయ సినిమా చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన మొట్టమొదటి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’. బి. సుభాష్ దర్శకత్వంలో 1982లో విడుదలైన ఈ మ్యూజికల్ డ్రామాలో మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించారు. సినిమా భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా రష్యాలో ఈ సినిమా ఊహించని స్థాయిలో హిట్ అయింది. ఆ కాలంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వంద కోట్లు వసూలు చేయడం ఒక అద్భుతం అని చెప్పాలి. మిథున్ చక్రవర్తి డాన్స్, స్టైల్, ఎనర్జీ ఆ సినిమాకి మరో స్థాయి అందించాయి.
కోలీవుడ్‌లో రజనీకాంత్ ‘శివాజీ’ సినిమా ఆ ఘనత అందుకుంది. తమిళ సినీ పరిశ్రమలో మొదటిసారి వంద కోట్ల మార్క్‌ను దాటిన సినిమా ‘శివాజీ’. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాసింది. రజనీకాంత్ గ్లామర్, శంకర్ విజన్, ఏఆర్. రెహమాన్ సంగీతం కలిసి సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. ఆ సినిమా తర్వాతనే కోలీవుడ్‌లో కూడా పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా ఆలోచనలు మొదలయ్యాయి.
ఇప్పుడు 100 కోట్లు సాధించడం చాలా ఈజీగా కనిపించినా, ఆ రికార్డుకు పునాది వేసిన సినిమాలు మాత్రం తమ సమయానికి అసాధారణమైనవి. తెలుగు ఇండస్ట్రీలో ‘మగధీర’, బాలీవుడ్‌లో ‘డిస్కో డాన్సర్’, కోలీవుడ్‌లో ‘శివాజీ’ — ఈ మూడు సినిమాలు భారతీయ సినిమా వసూళ్ల చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించాయి. ఈ సినిమాలు కేవలం వసూళ్ల రికార్డులు మాత్రమే కాదు, భారతీయ సినిమాకు కొత్త యుగానికి దారితీసిన సాంస్కృతిక మైలురాళ్లు కూడా అయ్యాయి.