
అయితే తాజాగా, వీరి మధ్య అంతా సవ్యంగా సాగడం లేదనే వార్తలు బయటకు వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ చెప్పే కొన్ని సూచనలు ప్రశాంత్ నీల్‌కి నచ్చడం లేదట. అలాగే, ప్రశాంత్ తీసుకునే కొన్ని డైరెక్టివ్ నిర్ణయాలు ఎన్టీఆర్‌కి సూట్ కావడం లేదని అంటున్నారు. ఈ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు క్రమంగా పెద్దవై, వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.అంతేకాదు, ఇటీవల ఎన్టీఆర్ బావమరిది పెళ్లి వేడుక జరిగింది. ఆ వేడుకకు ప్రశాంత్ నీల్ హాజరుకాలేదు. దీంతో, “ఎన్టీఆర్ ఆహ్వానించలేదా?” లేక “ప్రశాంత్ కావాలనే రాలేదా?” అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇద్దరూ గతంలో చాలా మంచి ఫ్రెండ్స్, “జాన్ జిగిడి దోస్త్”లుగా ఫేమస్ అయినా, ఇప్పుడు ఆ స్నేహానికి చీలిక వచ్చింది అనే భావన అభిమానుల్లో కలిగింది.
ఇంతకుముందే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్ కోసం భారీ సెట్స్ కూడా సిద్ధంగా ఉంచారట. అయితే ఆ షూటింగ్ నిలిచిపోయిందని, ప్రశాంత్ నీల్ తన టీంకి “ప్రస్తుతం వర్క్ స్టాప్” అని ఆదేశించాడని, కారణం ఎన్టీఆర్‌తో తలెత్తిన మనస్పర్థలేనని అనేక మీడియా పత్రికలు రాస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా తనవైపు నుండి ఈ విషయం పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం అభిమానుల్లో మరింత సందేహాలను రేకెత్తిస్తోంది.ఇప్పటివరకు చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఊహాగానాలు ఆగడం లేదు. “వార్త నిజమైతే మూవీ మేకర్స్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు?”, “అసలు ఇది పబ్లిసిటీ స్టంట్‌నా లేక నిజంగానే విభేదాలా?” అంటూ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇంకా కొంతమంది మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి ఎన్టీఆర్ బావమరిది పరోక్ష కారణమని చెబుతున్నారు. దాని వల్లే వాదనలు మరింత ముదిరాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వాదనలకు ఇప్పటివరకు ఎటువంటి ధృవీకరణ లేదు.ఏదేమైనా, గత 48 గంటలుగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మధ్య గొడవల వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం “ఈ ఇద్దరూ మళ్లీ కలసి పనిచేయాలి, ఇంత మంచి కాంబినేషన్ మధ్య తేడాలు రావొద్దు” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. చివరికి ఈ వార్తలో ఎంత నిజం ఉందో, ఎంత ఊహాగానమో, అది మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత కలుగుతుంది.