ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఒక సూత్రం ఉంది — “బాక్సాఫీస్‌ వద్ద పెద్ద స్టార్ హీరో సినిమా వస్తే, చిన్న హీరోల సినిమాలు తప్పుకోవాలి.” ఎందుకంటే ఆ భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, రిలీజ్ స్కేల్‌ను ఎవ్వరూ ఈజీగా తట్టుకోలేరు. ఆ సమయంలో ఎవరి సినిమా అయినా మధ్యలోకి వస్తే, అది బాక్సాఫీస్‌ వద్ద దెబ్బతినే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది మధ్యస్థ హీరోలు పెద్ద స్టార్ల సినిమాలు లేని సైలెంట్ డేట్స్‌లోనే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడుతుంటారు.అయితే, కొన్ని సందర్భాల్లో ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి తలపడే పరిస్థితులు కూడా వస్తాయి. “మాకు ఫ్యాన్ బేస్ ఉంది, క్రేజ్ ఉంది” అంటూ ఎవ్వరూ తగ్గకపోవడం వలన ఒకే తేదీకి రెండు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావడం కొత్త విషయం కాదు. కానీ, ఇలాంటి పోటీ వల్ల ఎవరికీ అసలు లాభం ఉండదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఎందుకంటే ఒక సినిమా విజయవంతం కావడం అంటే కేవలం హీరో, హీరోయిన్ కృషి మాత్రమే కాదు — దాని వెనుక ఉన్న వందలాది మంది సినీ కార్మికుల శ్రమ, నిర్మాతల పెట్టుబడి, థియేటర్ల షెడ్యూల్స్ అన్నీ కలిసి ఉండాలి. రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్లు సగం సగం అయిపోవడం, థియేటర్ షేరింగ్ సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. చివరికి దెబ్బ తినేది చిన్న టీంలే.ఇదే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “పెద్ది సినిమా” మార్చి 27న హీరో పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయింది. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని నటించిన “ది పారడైజ్” సినిమాను కూడా అదే వారాంలో — మార్చి 26న — రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ మొదట ప్లాన్ చేశారు.

దీంతో ఇరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌గా రానున్నాయి. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల పరంగా, థియేటర్ల షేరింగ్ పరంగా గట్టి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.అలాంటి సమయంలో, ఎవరూ తగ్గని ఈ రేసులో ముందుగా పెద్ద మనసు చూపినవారు హీరో నాని. ఆయన తన సినిమా “ది పారడైజ్” విడుదల తేదీని మార్చి నుంచి ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇది కేవలం తాను కాదు, పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ లాభం చేకూర్చే ఆలోచన అని అభిమానులు చెబుతున్నారు.

ఇటీవ‌లే నందమూరి బాలకృష్ణ కూడా ఓజీ రిలీజ్ అవుతున్న  సందర్భంగా  తన అఖండ మూవీని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అదే దారిలో నాని కూడా సాగుతున్నారు. “ఇండస్ట్రీకి ఇబ్బంది కలగకూడదు” అనే దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ప్రశంసనీయమని సోషల్ మీడియాలో నాని పై ప్రశంసల వర్షం కురుస్తోంది.నాని ఎప్పుడూ తన సినిమాలను హెల్తీ కాంపిటీషన్‌లోనే తీసుకువచ్చేవాడు. ఇతర హీరోల పట్ల గౌరవం చూపడం, ఫ్యాన్ వార్స్‌కి దూరంగా ఉండడం ఆయన స్టైల్‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈసారి కూడా అదే రీతిలో పెద్ద మనసుతో ముందుకు వచ్చి “రియల్ హీరో”గా నిలిచాడు.

ట్రేడ్ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే —“ఇండస్ట్రీ అంటే కేవలం హీరోల పోటీ కాదు. అది అందరి కృషి కలయిక. నాని తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఇతర స్టార్‌లకు ఒక మంచి ఉదాహరణ.”ఏప్రిల్ మొదటి వారంలో “ది పారడైజ్” విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆ సినిమాపై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరోవైపు, రామ్ చరణ్ సినిమా కూడా తన స్థాయిలో భారీగా విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌ సమ్మర్‌ సీజన్‌కి నిజమైన ఫెస్టివల్ మూడ్ తీసుకురాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: