టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB 29 పై సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నవంబరులో భారీ సర్‌ప్రైజ్ రానుంది. రాజమౌళి ఇప్పటికే ఈ నెలలో ప్రత్యేక అప్‌డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 11 లేదా 15న హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇది పబ్లిక్ ఈవెంట్ కావొచ్చని, అందుకు అనుమతుల కోసం ఇప్పటికే నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాకు ప్రభుత్వ స్థాయిలో సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలుసు కాబట్టి, అనుమతులు కూడా సులభంగా వచ్చే అవకాశం ఉంది. అభిమానుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని, వేదిక ఎంపిక విషయంలో రాజమౌళి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. 


గతంలో ఆయన కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగాయి కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ సిటీలోనే ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో SSMB 29 టైటిల్ రివీల్ చేయనున్నారు. అలాగే చిన్న గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేయనున్నారని టాక్. ఆ గ్లింప్స్ కోసం ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ఇప్పటికే పూర్తి అయినట్లు సమీప వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక, నవంబర్‌లో టైటిల్, గ్లింప్స్‌తో పాటు కొన్ని ప్రత్యేక సర్‌ప్రైజులు కూడా ఉండబోతున్నాయని సమాచారం. సినిమాలో నటించే ప్రధాన తారాగణం, టెక్నీషియన్లను కూడా ఒక్కొక్కరిని పరిచయం చేసే ప్రణాళికలో ఉన్నారు. మొత్తంగా చూస్తే, నవంబర్ నెల మొత్తం మహేష్ బాబు అభిమానులకు ఫెస్టివల్ లాంటిదే అవ్వబోతోంది. రాజమౌళి స్టైల్లో జరిగే ఈ ఈవెంట్‌కి సంబంధించిన అప్‌డేట్‌లు బయటకు రాగానే సోషల్ మీడియా మొత్తం “SSMB 29 ఫీవర్”తో ఊగిపోనుంది. ఒక్క సారి రాజ‌మౌళి ప్ర‌మోష‌న్లు మోద‌ల‌య్యాయి అంటే సోష‌ల్ మీడియా అంతా ఏ రేంజ్ లో ఊగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఈ సినిమాను 2026 స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: