
అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనకు వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రభాస్ అభిమానులు సృజనాత్మకంగా రూపొందించిన ఏఐ వీడియోలు, ఫోటోలు, బర్త్‌డే విషెస్ గ్రీటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రభాస్ వ్యక్తిత్వం, వినయం, హాస్పిటాలిటీ, మంచి మనసు వంటి విషయాలను అనేకమంది ప్రశంసిస్తున్నారు. అభిమానులు తమ అభిమాన నటుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, పాత జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. "ఈశ్వర్" నుండి "సలార్" వరకు అతని సినిమా ప్రయాణం, ముఖ్యంగా "బాహుబలి" తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం వంటి విషయాలను గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రేమతో కూడిన పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అతని కుటుంబ సభ్యులు కూడా అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే అభిమానులు, మీడియా వేదికల్లో, ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అసలు ఏం చదివాడు..? ఎక్కడ జన్మించాడు..? ఆయన ఇష్టాలు ఏమిటి..? హీరోగా ఎదగడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి..? ఆయన ఫేవరెట్ హీరోలు, ఫేవరెట్ హీరోయిన్లు ఎవరు’ అనే రకరకాల విషయాలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో, ప్రభాస్ హీరో కాకపోతే ఆయన ఏ రంగంలో సెటిల్ అయ్యి ఉండేవాడో అనే విషయం కూడా అభిమానుల మధ్య పెద్దగా ట్రెండ్ అవుతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయంపై స్పందిస్తూ .. “నాకు మొదట నుండి సినిమాలు పెద్దగా ఇష్టం లేదు. ఒకసారి కృష్ణంరాజు గారిని చూసి, ‘సరే, ఒకసారి హీరోగా ప్రయత్నిద్దాం’ అని అనుకున్నాను. ఆ తర్వాత సినిమాలకు ఇంకా ఎక్కువ ఆసక్తి పెరిగింది. అసలు, మొదట నుండే నాకు బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని కోరిక. పెద్ద వ్యాపారంలో కొనసాగాలి అనే కోరిక ఉంది. ఎప్పటికైనా ఒక పెద్ద బిజినెస్‌మెన్‌గా సెటిల్ అవుతాను” అని చెప్పాడు. ప్రస్తుతం, అభిమానులు మళ్లీ ఆ ఇంటర్వ్యూ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు..!!