ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పే జ్యోతిష్యం అప్పుడప్పుడు అడ్డం తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఈయన చెప్పిన చాలా విషయాలు జరగలేదు.ఈయన చెప్పిన విషయాలు కొన్ని కొన్ని జరగడంతోనే ఈయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ వేణు స్వామి తో చాలా మంది సెలబ్రిటీలు పూజలు కూడా చేయించుకున్నారు. కట్ చేస్తే.. వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం అక్కడక్కడ అడ్డం తిరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేణు స్వామికి చుక్కెదురయ్యింది. ఆయన చెప్పిన జ్యోతిష్యానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది.దాంతో వేణు స్వామి పై నెగిటివిటీ ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పటినుండి ఎవరి జాతకాలు చెప్పను అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.కానీ మళ్ళీ ఆయన జాతకాలు మొదలు పెట్టేసారు.

ఇదిలా ఉంటే గతంలో క్లీంకార పుట్టిన సమయంలో వేణు స్వామి రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరో సంతానం ఉండకపోవచ్చు అంటూ క్లారిటీగా చెప్పారు. వీరికి క్లింకార ఒక్కతే సంతానం అని,మళ్ళీ వీరికి పిల్లలు పుట్టే యోగం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ సమయంలో వేణు స్వామి చెప్పిందే నిజమని అంతా అనుకున్నారు.కానీ తాజాగా ఉపాసన శ్రీమంతం వీడియోతో వేణు స్వామి జ్యోతిష్యం మరోసారి తప్పింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయంలో వేణు స్వామి చేసిన ఈ కామెంట్లు గతంలో మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు.

 కానీ ఇప్పుడు ఉపాసన శ్రీమంతంతో వేణుస్వామిని సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తున్నారు.. అసలు నీకు జాతకాలు చెప్పడం వచ్చా.. ఫేమస్ అవ్వడం కోసమే ఇలా చేస్తావా.. నువ్వు చెప్పిందే నిజమైతే ఉపాసనకు రెండో సంతానం ఉండకూడదు కదా.. మరి మళ్ళీ ప్రెగ్నెంట్ ఎలా అయింది అంటూ  వేణు స్వామిని ఏకిపారేస్తున్నారు. అంతే కాదు నీ జ్యోతిష్యం తప్పని ఇప్పటికైనా ఒప్పుకో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ పై వేణు స్వామి ఏవిధంగా క్లారిటీ ఇస్తారో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: