సాధారణంగా సినీ సెలబ్రెటీలు అంటేనే తమ అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొంతమంది అందంగా కనిపించడానికి సర్జరీలు వంటివి చేయించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా గత కొంతకాలంగా ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ సర్జరీ చేయించుకోందనే విధంగా వార్తలు వినిపించాయి. తాజాగా టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ అనే షోలో పాల్గొన్న జాన్వీ సర్జరీ విషయం పైన క్లారిటీ ఇచ్చింది.



శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బారి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది, హీరో నానితో కూడా మరొక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ సర్జరీ చేయించుకోందనే వార్తలపై మాట్లాడుతూ.. అవును చేయించుకున్నాను..తన ప్రతి నిర్ణయం వెనుక తన తల్లి సలహా ఉంటుందని ఆమె అనుభవం వల్లే తాను తప్పులు చేయకుండా ముందుకు వెళుతున్నానని తెలియజేసింది జాన్వీ కపూర్. యువత సోషల్ మీడియాలో చూసిన వాటిని ఇప్పుడు బ్లైండ్ గా నమ్మి ఫాలో అవుతున్నారు అలా ఉండకూడదని తెలిపింది.


ఎవరో చేయించుకున్నట్టుగా మనం సర్జరీ చేయించుకోవాలనుకోవడం కూడా చాలా ప్రమాదమే ఎవరో డాక్టర్లు గా నటిస్తూ ఒక నటికి చేసిన సర్జరీల లిస్టును చూపిస్తూ కొన్ని వీడియోలను షేర్ చేస్తుంటారు అలా తన ఫోటో కూడా ఒకటి పెట్టి బఫెలో ప్లాస్టి చేయించుకుందంట అంటూ చెప్పారు. అది చూసి ఒక్కసారిగా తానే షాక్ అయ్యానని అలాంటి తప్పుడు సమాచారం విని ఎవరైనా సరే చేయించుకుంటే ఏదైనా తప్పు జరిగితే అది వినడానికి చాలా భయంకరమైన విషయమని తెలిపింది. యువకులు తమ శరీరాన్ని ప్రేమించాలి ,మనం మనల్ని అంగీకరించడంలో సిగ్గుపడకూడదు అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు మన మనసుని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి వాటిని పట్టించుకోకూడదు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: