ఉపాసన.. ప్రెగ్నెన్సీ న్యూస్ బయటకి వచ్చి 24 గంటలు అవుతుంది. కానీ  ఇప్పటికీ ఆ వేడీ..ఆ స్పెషల్ ఫీలింగ్.. ఆ ఆనందం తగ్గలేదు. సోషల్ మీడియాలో, టాలీవుడ్ సర్కిల్‌లో, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఎక్కడ చూసినా ఉపాసన రెండో సారి గర్భవతి అయ్యిందనే వార్తే ట్రెండ్ అవుతోంది. ఈసారి ఆమె కవలలకు జన్మనివ్వబోతుందనే వార్తతో అభిమానులు డబుల్ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు. త్వరలోనే ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని పండగ చేసుకుంటున్నారు. ఇటీవల ఉపాసన సీమంతం ఘనంగా జరిగింది. ఆ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కచోట చేరి సంతోషాన్ని పంచుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది — అదే చిరంజీవి తన కోడలికి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్!

అసలు మెగాస్టార్ చిరంజీవి ఉపాసనకి ఏం గిఫ్ట్ ఇచ్చారు..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చిరంజీవి ఇష్టపడితే కోట్లలో విలువ చేసే గిఫ్ట్ ఇవ్వగలరు, కానీ ఈసారి ఆయన ఇచ్చిన కానుక మాత్రం ధనంతో కొలవలేనిది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, చిరంజీవి తన కోడలికి ఎంతో పవిత్రమైన బాబా విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విగ్రహం సాధారణది కాదు — స్వయంగా షిరిడి నుండి ప్రత్యేకంగా పూజలు చేయించి, భక్తి శ్రద్ధలతో తయారు చేయించిన విగ్రహం అని తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని చిరంజీవి తన చేతులారా ఉపాసనకి ఇచ్చారట.

ఉపాసన ఎంతో భక్తిశ్రద్ధలతో బాబా కి సేవ చేస్తుంది అన్న విషయం చిరంజీవికి బాగా తెలుసు. ఆమెకు ఏం ఇస్తే హృదయపూర్వకంగా ఆనందపడుతుందో ఆయన అర్థం చేసుకున్నారు. అందుకే కోట్ల విలువైన గిఫ్ట్‌లకంటే ఈ ఆధ్యాత్మిక కానుకనే ఎంచుకున్నారని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ హార్ట్ టచింగ్ గిఫ్ట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు “ఇదే నిజమైన ఆప్యాయత కానుక” అని ప్రశంసిస్తున్నారు. ఉపాసనకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇప్పటికే ఈ వార్తపై సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతోంది. “ఇంత ప్రేమతో, భక్తితో ఇచ్చిన గిఫ్ట్ ఇంకెవరు ఇవ్వగలరు?” అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇక త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు చిన్నారులు రాబోతున్నారు. అందుకే మెగా అభిమానులందరూ “ఇది బిగ్ బిగ్ బిగ్ సర్ప్రైజ్!” అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: