ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. అదేంటంటే – స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య ఏదో విభేదాలు చోటుచేసుకున్నాయట. వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని, ప్రస్తుతం వాళ్లు మాట్లాడుకోవడం మానేశారని.. దీనివల్ల కలిసి చేస్తున్న సినిమా ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడిపోయిందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు మొదటగా ఫిల్మ్ సర్కిల్స్‌లో మొదలై, తర్వాత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి రూమర్స్ బయటకు వచ్చినప్పుడు సినిమా యూనిట్ వెంటనే స్పందించి, “ఇది పూర్తిగా ఫేక్ న్యూస్” అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి మాత్రం ప్రశాంత్ నీల్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ, ఆ సినిమా మేకర్స్ గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో అభిమానులలో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. “ఇది నిజమేనా?” అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నాయి.

అంతేకాదు, సోషల్ మీడియాలో మరో వార్త కూడా ఇప్పుడు పెద్దగా చర్చకు వస్తోంది. “వార్ 2” సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఒక ప్రతిష్టాత్మకమైన సొలో ప్రాజెక్ట్‌తో జూనియర్ ఎన్టీఆర్ ప్రవేశించబోతున్నాడని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తారక్ చేతులనుండి జారిపోయిందని తెలుస్తోంది. కారణం – ఇటీవల ప్రశాంత్ నీల్‌తో తారక్‌కి వచ్చిన విభేదాల వదంతులు వల్ల తారక్‌పై బాలీవుడ్ వర్గాల్లో కొంత నెగిటివిటీ ఏర్పడిందట. దాంతో ఆ ప్రాజెక్ట్‌ను మరో బాలీవుడ్ స్టార్‌కి అప్పగించారని మీడియాలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, “తారక్ బాలీవుడ్ సొలో ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడు” అనే న్యూస్ ఇప్పుడు తెలుగు మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఒక చిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుటుంబంలో జరిగిన బావమరిది పెళ్లి, తదితర కార్యక్రమాల కారణంగా ఆయన షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చాడు. ఈ కారణంగా సినిమాకు సంబంధించిన వర్క్ స్లో అయ్యిందని, దాంతో ప్రశాంత్ నీల్‌కి అసహనం వచ్చిందని కొందరు అంటున్నారు.

అదీ కాక, తారక్ బావమరిది పెళ్లికి ప్రశాంత్ నీల్ హాజరుకాలేదని సోషల్ మీడియాలో చాలా మంది గమనించారు. దీనివల్ల “ఇద్దరి మధ్య నిజంగా ఏదైనా తేడా వచ్చిందా?” అనే కొత్త అనుమానాలు కూడా మొదలయ్యాయి.ఇక ప్రస్తుతం ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా త్వరగా అన్నీ క్లియర్ అయి, సినిమా తిరిగి ట్రాక్‌లోకి రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: