ఈ సినిమా రాబోయే రోజుల్లో ఏకంగా రూ .1000కోట్ల టార్గెట్ ను కూడా రీచ్ అవుతుందంటూ పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇందులో రిషబ్ శెట్టి నటన దర్శకత్వానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. రుక్మిణి వసంత్, జయ రామ్, గుల్షన్ దేవయ్య తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వర్షన్ కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ విడుదల కాబోతోంది.
ఇప్పటికే తెలుగు వర్షన్ ఏకంగా రూ 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబడినట్లు ప్రచారం అయితే జరుగుతోంది. చివరిలో కాంతార చాప్టర్2 ఉంటుందంట చిత్ర బృందం ప్రకటించింది. రిషబ్ శెట్టి సినీ కెరియర్ విషయానికి వస్తే 2012లో తుగ్లక్ అనే సినిమా ద్వారా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టిన ఎన్నో చిత్రాలలో నటించిన రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో భారీ క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం జై హనుమాన్, చత్రపతి శివాజీ మహారాజ్ వంటి సినిమాలలో నటిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు రావాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి